గంజాయిని(Weed) అరికట్టాలని ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఎక్కడో ఓ చోట గంజాయి అక్రమరవాణా(Weed Smuggling) బయటపడుతూనే ఉంది. రోజురోజుకు ఈ మాఫియా కొత్త పుంతలు తొక్కుతోంది. గంజాయి తరలింపును మరో కొత్త ఎత్తుగడ వేసింది. పుష్ప(Pushpa) సినిమాలో ఎర్రచందనం(Red sandal) దుంగలను తరలించేవిధానాన్ని స్ఫూర్తిగా తీసుకున్నారేమో.. తాజాగా ఓ గంజాయి ముఠా ఇదే తరహాలో ప్లాన్ వేసింది. నాగార్జునసాగర్‌లో(Nagarjuna Sagar) ఓ డీసీఎంలో తరలిస్తున్న గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం..

ఓ డీసీఎంలో(DCM) అక్రమంగా మహారాష్ట్రకు(Maharastra) తరలిస్తున్న గంజాయిని నాగార్జునసాగర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పుష్ప సినిమాలో ఎర్రచందనాన్ని తరలించినట్లుగా ఇక్కడ టమాటాల ట్రేల(Tomato tray) మధ్యలో గంజాయిని ఉంచి తరలిస్తున్నారు. పక్కా సమాచారంతో దాడులు చేసి 330 కిలోల గంజాయి ఉన్న 168 ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. నలుగురు ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్నారని తేలింది. దీంతో నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.