తెలుగువారి వంటలో.. ముఖ్యంగా నాన్ వెజ్ లో.. కొత్తిమీర.. పూదీనా కూడా ఉండాల్సింది. చిన్నటి గుండ్రంగా ఉండే ఆకుల్లో ఎన్ని పోషక విలువలు ఉన్నాయో తెలుసా..? తేనీటి నుంచి మొదలు ఆల్కహాల్ వరకూ అనేక పానీయాల్లో దీనిని వినియోగిస్తారు. చాలా సలాడ్స్‌లో(Salads), డెజర్ట్స్‌లో(Desserts) .. ఇక అంతా మెచ్చే బిర్యానీలలో(Biryani) కూడా పుదీనా వాడుతారు.

పుదీనా(Mint) జ్ఞాపకశక్తిని(Memory Power) మెరుగుపరిచి మెదడు పనితీరు చురుగ్గా ఉండేలా చేస్తుంది. పుదీనాను తరచూ తీసుకోవడం వల్ల ఏకాగ్రత(Concentrate) పెరుగుతుంది. అంతేకాకుండా మెదడులోని ఇతర భాగాలు చక్కని పనితీరు కనపరుస్తాయి.

కంటి చూపు బాగుండేందుకు తోడ్పడే విటమిన్ ఏ(Vitamin A) పుదీనాలో బాగా లభిస్తున్నందున దీనిని మీరోజువారీ ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.పుదీనా ఆకులు జీర్ణ(Digestion) వ్యవస్థను బాగు చేస్తాయి.

ముఖ్యంగా గ్యాస్(Gas), కడుపు ఉబ్బరం(Bloating), కడుపు నొప్పి, చాతీలో మంట, ఎసిడిటీ వంటి వాటికి ఇది హోమ్ రెమెడీ. భోజనంలో పుదీనా గానీ, మింట్ ఆయిల్ గానీ ఉంటే ఈ జీర్ణ క్రియ సమస్యలన్నీ దారికొస్తాయి. బిర్యానీ, మాంసాహారం వంటి మసాల ఫుడ్‌లో పుదీనా కలపడం వల్ల తేలిగ్గా జీర్ణమవుతాయి.

చూయింగ్ గమ్ బదులు పుదీనా ఆకులు తింటే నోరు తాజాగా ఉంటుంది. అప్పుడప్పుడు పుదీనా ఆకులను నమలడం వల్ల నోరు శుభ్రపడుతుంది. దంతాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. పుదీనాలో ఉన్న నూనెలు తాజా శ్వాసను కలిగిస్తాయి. పుదీనా నూనె ఉన్న మౌత్ వాష్ వాడటం వల్ల నోటిలోని బ్యాక్టీరియా అంతమై చిగుళ్లు, దంతాలు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటాయి.

శ్వాసకోశ వ్యాధులను నివారించడానికి సిఫారసు చేసే ఆవిరి పట్టడం, ఇన్ హేలర్లలో పుదీనా ఉంటుంది. ఇది ముక్కు, గొంతు, శ్వాసనాళం, ఊపిరితిత్తుల మార్గాలను శుభ్రపరిచి దీర్ఘకాలిక దగ్గును కూడా దూరం చేస్తుంది. జలుబుతో ముక్కు కారుతుంటే నాలుగు చుక్కల పుదీనా ఆకుల రసం ముక్కులో వేస్తే మంచి ఫలితం ఉంటుంది.

Updated On 3 Oct 2023 4:25 AM GMT
Ehatv

Ehatv

Next Story