పరుషుడి వృషణాలపై(Human Testicle) యూనివర్సిటీ ఆఫ్ న్యూ మెక్సికో పరిశోధకులు ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడించారు. సంతానోత్పత్తికి కీలకమైన పురుషుడి వృషణాల్లో కూడా మైక్రీప్లాస్టిక్(microplastics) రేణువులు ఉన్నట్లు యూనివర్సిటీ ఆఫ్ న్యూ మెక్సికో పరిశోధకులు తెలిపారు. పురుషులు(Male), మగ కుక్కలపై(male dogs) ఈ అధ్యయనం చేసినట్లు పరిశోధకులు చెప్తున్నారు.
పరుషుడి వృషణాలపై(Human Testicle) యూనివర్సిటీ ఆఫ్ న్యూ మెక్సికో పరిశోధకులు ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడించారు. సంతానోత్పత్తికి కీలకమైన పురుషుడి వృషణాల్లో కూడా మైక్రీప్లాస్టిక్(microplastics) రేణువులు ఉన్నట్లు యూనివర్సిటీ ఆఫ్ న్యూ మెక్సికో పరిశోధకులు తెలిపారు. పురుషులు(Male), మగ కుక్కలపై(male dogs) ఈ అధ్యయనం చేసినట్లు పరిశోధకులు చెప్తున్నారు. పురుషుల వృషణాల్లో కుక్కలతో పోలిస్తే మూడు రెట్లు అధికంగా మైక్రోప్లాస్టిక్ రేణువులు ఉన్నట్లు గుర్తించామన్నారు. పురుషుల వృషణాల్లో గ్రాము కణజాలంలో 329.44 మైక్రోగ్రాముల మైక్రోప్లాస్టిక్ అవశేషాలు ఉన్నట్లు, అలాగే కుక్కల్లో 122.63 మైక్రోగ్రాముల మైక్రోప్లాస్టిక్ ఉన్నట్లు గుర్తించాని తెలిపారు. దీని కారణంగా పురుషుల సంతానోత్పత్తిపై(Reproduction) ప్రభావం చూపుతుందని ఓ పరిశోధకుడు జియోజింగ్ యూ వెల్లడించారు. వృషణాల్లో 12 రకాల మైక్రోప్లాస్టిక్ రేణువులను కనుగొన్నామని.. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, బ్యాగ్స్ తయారీకి వాడే పాలీఇథైలీన్ (పీఈ), పాలీవినైల్ క్లోరైడ్ (పీవీసీ) కూడా ఇందులో ఉన్నట్టు వెల్లడించారు. అంతేకాకుండా మనుషుల రక్తం(Blood), గుండెలో(Heart) మైక్రోప్లాస్టిక్ ఉన్నట్లు తెలిపారు. మరోవైపు గర్భిణుల్లో ఉండే మావి నమూనాలను కూడా పరీక్షిస్తే ప్రతి గ్రాము కణజాలంలో 6.5 నుంచి 790 మైక్రోగ్రాముల మైక్రోప్లాస్టిక్ రేణువులు ఉన్నట్లు గుర్తించారు. ఆహార పదార్థాల నిల్వ ఉంచే ప్లాస్టిక్ బాటిళ్ల కారణంగానే వృషణాల్లో, ఇతర అవయవాల్లో మైక్రోప్లాస్టిక్ పెరుగుతోందని అధ్యయనంలో తేలింది.