మామిడి పండ్లలో సరిపడా విటమిన్ - ఏ ఉంటుంది. ఇందులో విటమిన్ - సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. వీటితో పాటు మామిడి పండులో కాపర్, ఫోలేట్, విటమిన్ ఇ, విటమిన్ బి వంటి విటమిన్లు, ఖనిజాలు అదనంగా లభిస్తాయి. వాటి వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణ సమస్యలకు ఈ మామిడిపండు చక్కని పరిష్కారం అని చెప్పవచ్చు .
సమ్మర్ సీజన్ లో మాత్రమే దొరికే పండ్లలో మామిడిపండ్లకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు . ఈ మామిడిపండ్లు చూడటానికే కాదు...రుచిలోనూ తగ్గేది లేదు... ఆహా అనాల్సిందే .... అయితే, మామిడి పండ్లను తింటే వేడి చేస్తాయని చాలామంది భయపడతారు కానీ . మామిడి పండ్లను అదేపనిగా అతిగా తినేవారికి మాత్రమే ఆ సమస్యలు వస్తాయి. రోజుకు ఒకటి లేదా రెండు పండ్ల చొప్పున తినేవారికి ఎలాంటి సమస్య ఉండదు. పైగా ఎన్నో ప్రయోజనాలు కూడా. వేసవిలోనే అందుబాటులో ఉండే ఈ పండు తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మామిడి పండ్లలో సరిపడా విటమిన్ - ఏ ఉంటుంది. ఇందులో విటమిన్ - సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. వీటితో పాటు మామిడి పండులో కాపర్, ఫోలేట్, విటమిన్ ఇ, విటమిన్ బి వంటి విటమిన్లు, ఖనిజాలు అదనంగా లభిస్తాయి. వాటి వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణ సమస్యలకు ఈ మామిడిపండు చక్కని పరిష్కారం అని చెప్పవచ్చు . ఈ పండులో డైజెస్టివ్ ఎంజైములు ఉంటాయి. ఇందులో నీటి శాతం, ఫైబర్.. శరీరంలోని అతిసారం, మలబద్ధకం, విరేచనాలు వంటి సమస్యలను నియంత్రించడంలో సహాయపడుతాయి. మామిడి పండ్లలో ఐరన్ కూడా లభిస్తుంది. రక్తహీనత సమస్యతో బాధపడేవారికి మామిడి పండ్లు మంచి ఔషదం కూడా.
మామిడి పండ్లను తినడం వల్ల శరీర బరువును నియంత్రించుకోవచ్చు. మామిడి తొక్కలో ఫైటోకెమికల్ ఉంటుంది. ఇది సహజ కొవ్వును కరిగేలా చేస్తుంది. అంటే శరీరంలోని కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. డైటరీ ఫైబర్ మామిడిలో ఉంటుంది. ఇది కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది. మనం అధిక ఫైబర్ పండ్లు లేదా కూరగాయలు తిన్నప్పుడు, ఎక్కువసేపు ఆకలితో ఉండలేము . దీని వల్ల అతిగా ఆహారాన్ని తినకుండా ఉండేందుకు మామిడి పండ్లు సహకరిస్తాయి. అంతేకాదు మామిడి మనల్ని గుండె జబ్బుల నుంచి కూడా కాపాడుతుంది. ఫైబర్, పొటాషియం వాటి వల్ల గుండె నుంచి ప్రవహించే ధమనులలో ఎలాంటి అడ్డంకి లేకుండా కాపాడుతాయి. పాలీఫెనాల్ బయోయాక్టివ్‌గా ఉండటం వల్ల గుండె ఆరోగ్యానికి చాలా మంచిది.