టమాటాలకు (Tomatoes)సరైన ధరలేక రోడ్డు పక్కన పారబోసి,మద్దతు ధర లేదని పొలాల్లోనే పంటను దున్నేసిన రోజులు చూసాం.. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది.. కిలోల కొద్దీ టమాట ఉన్న వ్యక్తికి డబ్బులే డబ్బులు ..ఎందుకు అంటే టమాటకు అంత డిమాండ్ ఉంది మార్కెట్ లో..

టమాటాలకు (Tomatoes)సరైన ధరలేక రోడ్డు పక్కన పారబోసి,మద్దతు ధర లేదని పొలాల్లోనే పంటను దున్నేసిన రోజులు చూసాం.. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది.. కిలోల కొద్దీ టమాట ఉన్న వ్యక్తికి డబ్బులే డబ్బులు ..ఎందుకు అంటే టమాటకు అంత డిమాండ్ ఉంది మార్కెట్ లో..

డిమాండ్ ను గుర్తించి టమాట సాగు చేసి అందులో సక్సెస్ అయ్యి కోటి రూపాయలు సంపాదించాడు ఓ రైతు..ఇది ఎక్కడో ఇతర రాష్ట్రాల్లో అనుకంటే మీరు పప్పులో కాలేసినట్లే..ఈయన తెలంగాణ(Telangana) రాష్ట్రానికి చెందిన రైతు..మీరు విన్నది నిజమేనండి..మెదక్(Medhak) జిల్లా కౌడిపల్లి(Koudipally) మండలం మహ్మద్ నగర్ కి చెందిన రైతు మహిపాల్ రెడ్డి(Mahipal Reddy) టమాట సాగు చేసి ఇప్పటి వరకు కోటి రూపాయలు సంపాదించాడు.

ఆధునిక పద్దతిలో సాగు చేసి, ఎకరాకు పది లక్షల లాభలు గడిస్తున్నాడు ఆ రైతు..మహిపాల్ రెడ్డి మొదటి నుండి ఎక్కువగా కూరగాయల సాగే చేసేవాడు..అయితే టమాట పంటను ఎక్కువగా మన రాష్ట్రాల వారు మే, జూన్,జులై లో ఇతర రాష్ట్రాల నుండి దిగుమతి చేసుకుంటారు..దీన్ని గుర్తించిన రైతు మహిపాల్ రెడ్డి ఏప్రిల్ లో టమాట సాగు ప్రారంభించాడు..ఈ సమయంలో మన రాష్ట్రాల్లో వేడి బాగా ఉంటుంది కాబట్టి సాగు ఎక్కువ రాదు అని చాలా మంది సాగు చేయరు అందుకే టమాటకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది అని గమనించి, దానికి అనుగుణంగా సాగు చేసి అధిక లాభాలు సాధిస్తున్నాడు..

నూతన, ఆధునిక వ్యవసాయ పద్దతిలో ఈ టమాట సాగు చేసాడు..12 ఎకరాల్లో టమాట సాగు చేస్తే.. ఎకరాకు 2 లక్షల పెట్టుబడి ఖర్చు వచ్చింది..ఇక ఎకరాకు పది లక్షల లాభం వచ్చింది.. అంటే 12 ఎకరాలకు కోటి రూపాయల వరకు లాభం వచ్చింది అంటున్నాడు రైతు మహిపాల్ రెడ్డి..ఇక టమాట సాగు పై కోటి రూపాయలు వస్తుండంతో మహిపాల్ రెడ్డిని చూసి మిగతా రైతులు అవాక్కవుతున్నారు.

Updated On 22 July 2023 2:08 AM GMT
Ehatv

Ehatv

Next Story