మాడుగుల హల్వా(Madugula Halwa) గురించి మీరు వినే ఉంటారు. కాదుకాదు తినే ఉంటారు. దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శోభనం(First Night) రోజు మాడుగుల నుంచి ప్రత్యేకంగా తెప్పిస్తారు. ఆన్‌లైన్‌ ద్వారా కస్టమర్ల లొకేషన్‌కే ఈ హల్వాను డెలివరీ చేస్తున్నారు. దాదాపు 140 ఏళ్ల క్రితం మాడుగుల గ్రామానికి చెందిన దంగేటి ధర్మారావు(Dangeti Dharma) అనే వ్యక్తి మిఠాయిల వ్యాపారాన్ని ప్రారంభించారు.

మాడుగుల హల్వా(Madugula Halwa) గురించి మీరు వినే ఉంటారు. కాదుకాదు తినే ఉంటారు. దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శోభనం(First Night) రోజు మాడుగుల నుంచి ప్రత్యేకంగా తెప్పిస్తారు. ఆన్‌లైన్‌ ద్వారా కస్టమర్ల లొకేషన్‌కే ఈ హల్వాను డెలివరీ చేస్తున్నారు. దాదాపు 140 ఏళ్ల క్రితం మాడుగుల గ్రామానికి చెందిన దంగేటి ధర్మారావు(Dangeti Dharma) అనే వ్యక్తి మిఠాయిల వ్యాపారాన్ని ప్రారంభించారు. దీంతో ఏదైనా కొత్త స్వీట్‌(Sweet) తయారీని ఆయన ఆలోచించారు. ధర్మారావు ఆలోచనలో నుంచి పుట్టిందే ఈ మాడుగుల హల్వా. దీనిని తయారు చేసేందుకు 4 రోజుల సమయం పడుతుంది.

ముందుగా గోధుమలు(Wheat Grains) 3 రోజులు నానబెట్టి రోటిలో రుబ్బి గోధుమ పాలు సేకరిస్తారు. గోధుమ పాలను ఒక రోజు పులియబెట్టి… పంచదార(Sugar), ఆవు నెయ్యి(Ghee) కలిపి దగ్గరకు మరిగే వరకు ఇనుప కళాయిలో తిప్పుతారు. ఆ పాకాన్ని దించి దానిపై బాదం, జీడిపప్పు వేస్తారు. ఇదే మాడుగుల హల్వా. కట్టెల పొయ్యి మీద మాత్రమే పాకం పడతారు. ఇలా చేసిన హల్వా నెల రోజుల వరకు పాడవకుండా ఉంటుందని నిర్వాహకులు చెప్తున్నారు. ముఖ్యం పాకం కరెక్ట్‌గా వచ్చింద లేదా అని చెప్పడమే ఈ హల్వా తయారీలో కీలకమంటున్నారు. చాలా అనుభవం ఉన్నవారు మాత్రమే ఈ పాకం దగ్గర ఉండాలంటున్నారు.

శోభనం రోజు ఈ హల్వా తింటే లైంగిక సామర్థ్యం పెరిగి..రెచ్చిపోతారన్న నమ్మకం ఉంది. దీంతో ఫస్ట్‌నైట్‌న మాడుగుల హల్వా కోసం ఆర్డర్ ఇచ్చి తెప్పిస్తారట. అంతేకాకుండా బాలింతలకు శక్తి కోసం కూడా దీనిని ఆహారంగ అందిస్తారు. మాడుగుల హల్వాకు మామూలు క్రేజ్‌ లేదు. సాధారణ ప్రజల నుంచి ప్రముఖులు, సెలెబ్రెటీలు, సినీరంగానికి చెందినవారు, రాజకీయనాయకుల వరకు ఈ మాడుగుల హల్వాను ఇష్టంగా ఆరగిస్తారట. దీని విలువ కిలోకు రూ.400 నుంచి 600 ఉంటుందట. హైదరాబాద్, చెన్నై, బెంగళూరులాంటి ప్రధాన నగరాలతో పాటు విదేశాలకు కూడా ఈ హల్వాను పార్శిల్‌ చేస్తారు. 1500 కుటుంబాలు ఈ హల్వా తయారీపై ఆధారపడి ఉపాధి పొందుతున్నారు

Updated On 12 Jan 2024 7:05 AM GMT
Ehatv

Ehatv

Next Story