దాదాపు మనం వాడే కూరగాయలు, పండ్లలో కాయల కంటే తొక్కలే(Peel) ఎక్కువ సుగుణాలు కలిగి ఉంటాయి. ఇది ఒప్పుకోవల్సిన నిజం. కాని మనం మాత్రం తొక్క అని దాన్ని తీసి పడేస్తుంటాం. ఇప్పటికి వెనకటి వారు.. అరటిపండును తొక్కతో సహా తింటుంటారు. కొంత మంది మాత్రమే అలా చేసినా.. అది ఆరోగ్యానికి మంచిదే. ఇక ఆ విషయం పక్కన పెడితే.. ఇప్పుడు మనం నిమ్మ తొక్క వల్ల ఉపమోగాలు తెలుసుకుందాం.

నిమ్మరసాన్ని(Lemon) పిండి దాని తొక్కలను(Lemon Peel) డస్ట్ బిన్ లో వేసేస్తుంటారు. ఎందుకంటే ఇవి దేనికీ పనికి రావని. నిమ్మకాయతో మన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. అది అందరకి తెలిసిందే.. అయితే దీని తొక్కలు కూడా ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తాయి అనేది మాత్రం చాలా తక్కువ మందికి తెలుసు.

అవును నిమ్మతొక్కలు బరువు తగ్గడానికి(Weight Loss), అందంగా(Beauty) కనిపించడానికంటూ ఎన్నో విధాలుగా మనకు మేలు చేస్తాయి. నిమ్మ రసంలోనే కాదు దీని తొక్కలో కూడా ఎన్నో రకాల పోషకాలుంటాయి. ఇవి మన జుట్టుకు, చర్మానికి చేసే మేలు ఎంతో. అందుకే నిమ్మతొక్కతో ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి?

ఈ తొక్కలో ఉండే విటమిన్ సి చర్మంపై కనిపించే వయసు మచ్చలను కూడా తగ్గిస్తుంది. అలాగే కొల్లాజెన్ ఉత్పత్తిని కూడా పెంచుతుంది. ఇది చర్మాన్ని మృదువుగా, ప్రకాశవంతంగా చేస్తుంది

చిగుళ్లు, దంత కుహరాలకు సంబంధించిన అంటువ్యాధులను తగ్గించడానికి నిమ్మకాయలు బాగా ఉపయోగపడతాయి. తొక్కతో మీ దంతాలను రుద్దండి అందులో ఉండే యాంటీ బాక్టీరియల్ లక్షణాలు నోటి లోపల సూక్ష్మజీవుల పెరుగుదలను తగ్గిస్తాయి. ఇది మన దంతాలు, చిగుళ్లతో సహా మొత్తం నోటి ఆరోగ్యాన్ని కాపాడటానికి సహాయపడుతుంది.

నిమ్మ తొక్కలో ఉండే ఫ్లేవనాయిడ్లు, విటమిన్ సి వెయిటింగ్ మన రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి సహాయపడతాయి. బలమైన రోగనిరోధక వ్యవస్థ మన శరీరాన్ని దగ్గు, జలుబు, ఫ్లూ బారిన పడకుండా రక్షిస్తుంది. అందుకే తొక్కలోది కదా అని నిమ్మతోక్కను తీసి పడేయకండి.

Updated On 1 Oct 2023 2:05 AM GMT
Ehatv

Ehatv

Next Story