హైదరాబాద్(Hyderabad) కోఠిలో ఉన్న ప్రముఖ గోకుల్‌చాట్(Gokulchat) అధినేత ముకుంద్‌దాస్(Mukund Das) (75) అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో() బాధపడుతున్న ముకుంద్‌దాస్ కాచిగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ కన్నుమూశారు.

ముకుంద్‌దాస్ 1966లో కోఠిలో(Koti) గోకుల్ చాట్ పేరుతో చాట్ భండార్ ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు గోకుల్‌చాట్.. చాట్ ప్రియుల ఆదరణ కొనసాగుతూనే వస్తుంది. అప్పటి నుంచి గోకుల్ చాట్ క్రమక్రమంగా ఫేమస్ అయిపోయింది. చాట్ అంటే మనకు గుర్తొచ్చేది గోకుల్ చాటే కావడం విశేషం. 2007లో ఉగ్రవాదులు గోకుల్‌చాట్‌లో బాంబ్ బ్లాస్ట్ చేసి 33 మంది ప్రాణాలను బలితీసుకున్నారు. ఆ తర్వాత కొన్నాళ్లు మూతపడినా.. మళ్లీ తెరుచుకుంది. ఆ తర్వాత కూడా చాట్ ప్రేమికులు ఇక్కడికి వెళ్లి వివిధ రకాల చాట్‌ను ఆరగిస్తున్నారు. ముకుంద్‌దాస్ మరణంతో సుల్తాన్‌బజార్‌లో విషాదఛాయలు నెలకొన్నాయి.