గుడ్డులో(Eggs) ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. అందుకే రోజూ గుడ్డు తినాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అల్పాహారానికి గుడ్లు మంచివి. ఇది రోజంతా మనల్ని ఉత్సాహంగా ఉంచుతుంది. ఇది మన రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఇది అనేక వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

అయితే, కొంతమంది మాత్రం తమ ప్రోటీన్ అవసరాలను తీర్చుకోవడానికి పచ్చి గుడ్లను(Raw eggs) తింటారు. దీని వల్ల నిజంగా ఉపయోగం ఉందా..? పచ్చి గుడ్డులో పోషకాలు ఉంటాయన్న మాటలో నిజం ఎంత..? పచ్చిగుడ్డు వల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉందా..?
చాలా మంది గుడ్డులోని తెల్లసొనను పచ్చిగా తింటారు. ముఖ్యంగా బాడీబిల్డర్లు(Body bilders), బరువు తగ్గాలని(Weight loss) ప్రయత్నించే వారు, ప్రొటీన్లు ఎక్కువగా తీసుకోవాలనుకునే వారు ఈ పని చేస్తుంటారు. ఎందుకంటే పచ్చి గుడ్డులోని తెల్లసొనలో అనేక పోషకాలు ఉంటాయని భావిస్తున్నారు.
కాని ఇది అవాస్తవం. ఎందుకంటే సాల్మొనెల్లా, జీర్ణ వాహిక యొక్క సాధారణ బ్యాక్టీరియా సంక్రమణ పచ్చి గుడ్డులోని తెల్లసొన తినడం ద్వారా వ్యాపిస్తుంది. అందుకే పచ్చి గుడ్లు తినడం మంచిది కాదు. కాబట్టి ఉడికించిన గుడ్లు తినండి.
పచ్చి గుడ్లు, ముఖ్యంగా తెల్లసొన తినడం మంచిది కాదు. దీని వల్ల బయోటిన్ లోపం ఏర్పడుతుంది. పచ్చి గుడ్డులోని తెల్లసొనలో ఉండే అవిడిన్ అనే ప్రొటీన్, బి విటమిన్ బయోటిన్‌ను శరీరం గ్రహించకుండా నిరోధిస్తుంది. ఇది బయోటిన్ లోపానికి దారితీస్తుంది. ఇది అనేక ఆరోగ్య సమస్యలకు కూడా దారి తీస్తుంది.
గుడ్డులోని తెల్లసొనలో ఉండే యాంటీ-అవిడిన్ బి విటమిన్ బయోటిన్‌ను అవిడిన్‌తో బంధించకుండా నిరోధిస్తుంది మరియు దాని శోషణను నిరోధిస్తుంది. కాబట్టి గుడ్లు ఉడకకుండా తినకూడదు.