ఉదయం బ్రేక్ ఫాస్ట్(Breakfast) లో బెస్ట్ ఏదీ అంటే చాలా మంది ఆరోగ్యకరమైన ఆహారం ఇడ్లీ(Idli) అని చెపుతారు. ఎందుకంటే ఇందులో నూనె ఉండదు మరియు ఆవిరి ద్వారా వండుతారు. ఇడ్లీ జీర్ణ రుగ్మతలు లేదా కొలెస్ట్రాల్ సమస్యలను కలిగించదు కాబట్టి ఇది ఉత్తమమైన అల్పాహారంగా చెప్పబడింది. కానీ, ఈరోజుల్లో టైమ్ లేక లేదా మన బద్దకం వల్ల .. చాలా మంది ఇడ్లీ పిండి, దోసెల పిండిని రెడీమేడ్ గా బయట నుంచి కొంటున్నాం. కాని వీటి వల్ల మన ఆరోగ్యానికి హాని కలుగుతోందని మీకు తెలుసా..?

గ్రైండర్లు వచ్చిన తరువాత పిడి రుబ్బే పని తప్పింది అని అనుకునే లోపు.. రెడీ మెడ్ పిండ్లు(Idli Ready Mix) వచ్చి.. ఇంట్లో ఉన్నవారిని ఇంకా బద్దకస్తులను చేశాయి. అంతే కాదు అందులో ఉండే చెత్తా చెదారం వల్ల మనిషి అనారోగ్యం పాలు కూడా అవుతున్నారు. ఈ రెడీమెడ్ పిండ్లు.. కొంత మంది చాలా మంచి క్వాలిటీగా ఇస్తున్నా.. ఎక్కువశాతం మంది అశుభ్రవాతవారణంలో వీటిని రబ్బడం వల్ల రోగాలను డబ్బులిచ్చి కొనుకొవడం జరుగుతోంది.

మన ఇంట్లో అయితే.. పిండి రుబ్బగానే రోలు కాని.. గ్రైండర్ కాని.. శుబ్రంగా కడిగేస్తాం.. మనం కూడా శుబ్రంగా ఉంటూ పిండిని రుబ్బుతాం.. కాని బయట దుకాణాల్లో విక్రయించే పెద్ద గ్రైండర్లు ఎంత శుభ్రంగా ఉంటాయో ఎవరికి తెలుసు? పిండిని గ్రైండర్ చేసేటప్పుడు మరియు గ్రైండర్ కడగేటప్పుడు శుభ్రమైన నీటిని వాడాలి. లేదంటే ఎకోలీ బ్యాక్టీరియా వచ్చే అవకాశం ఎక్కువ. ఇది మెత్తగా పిండి చేసేటప్పుడు ఇడ్లీ మరియు దోస పిండిలో చేరి పిల్లల్ని పెడతాయి.

ఈ ఎకోలి బాక్టీరియా(coli bacteria) ప్రభావం వల్ల దీర్ఘకాలిక కడుపునొప్పి, విరేచనాలు, శరీరం పొడిబారడం, వాంతులు, మూర్ఛ, గ్యాస్ట్రిక్(Gastric) వ్యాధి, తలతిరగడం వంటి ఆరోగ్య ప్రమాదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మేము ప్రతిరోజూ ఇడ్లీ మరియు దోస మాత్రమే తింటాము? అలాంటప్పుడు ఆరోగ్య సమస్యలు ఎలా వస్తాయి... అని మీకు డౌట్ రావచ్చు కాని బయట షాపుల నుంచి కొనే ఇడ్లీ పిండిలో ఉండే బ్యాక్టీరియా.. పిండిని ఉడకబెట్టినా పూర్తిగా నశించదు.

అంతే కాదు ఈ పిండి కి వాడే బియ్యం.. నాన్యమైనవేనా.. అందులో రాళ్లు, పురుగులు లేకుండా జాగ్రత్తగా శుబ్రం చేశారా లేదా..? ఇలాంటివి కూడా మనం దృష్టిలో ఉంచుకోవల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలా మాట్లాడుకుంటే.. చాలా విషయాలు బయట కొనే పిండికి సబంధించి నెగెటీవు గానే కనిపిస్తాయి. ప్రస్తుంతం రెడీమెడ్ పిండి అనేది పెద్ద వ్యాపారంగా మారింది. ప్రతీ ఒక్కరు రోడ్ సైడ్ చిన్న టేబుల్ వేసుకుని కూడా వీటిని అమ్మేస్తున్నారు. సో జాగ్రత్తగా ఉండటం చాలా మంచింది.

Updated On 6 May 2024 7:31 AM GMT
Ehatv

Ehatv

Next Story