ఆవు పాల(Cow milk) ఆరోగ్యానికి చాలా మంచివని చెప్తుంటారు. గేదె పాల కంటే ఆవు పాలే ఆరోగ్యకరమని అంటారు. కానీ ఈ ఆవు పాలు ఏడాదిలోపు పిల్లలకు(New Born) తాగించకూడదని నిపుణులు చెప్తున్నారు. నవజాతశిశువుకు ఆవు పాల వల్ల కలిగే ప్రయోజనాలు లేవని అంటున్నారు. ఆవు పాలలో ఉన్న ప్రొటీన్, ఖనిజాలను నవ జాత శిశువులు జీర్ణించుకోలేరని.. ఇది వారి ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని అంటున్నారు.
ఆవు పాల(Cow milk) ఆరోగ్యానికి చాలా మంచివని చెప్తుంటారు. గేదె పాల కంటే ఆవు పాలే ఆరోగ్యకరమని అంటారు. కానీ ఈ ఆవు పాలు ఏడాదిలోపు పిల్లలకు(New Born) తాగించకూడదని నిపుణులు చెప్తున్నారు. నవజాతశిశువుకు ఆవు పాల వల్ల కలిగే ప్రయోజనాలు లేవని అంటున్నారు. ఆవు పాలలో ఉన్న ప్రొటీన్, ఖనిజాలను నవ జాత శిశువులు జీర్ణించుకోలేరని.. ఇది వారి ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని అంటున్నారు. ఆవు పాలల్లో ఉండే సంక్లిష్ట ప్రొటీన్ చిన్న పిల్లల కిడ్నీలపై చెడు ప్రభావాన్నిచూపిస్తాయి. అంతేకాకుండా శిశువుల మలంలో రక్తం కూడా వస్తుంది అంటారు. ఆవు పాలలో విటమిన్-సి, ఐరన్ పోషకాలు ఉండవని.. వీటి వల్ల శిశువు ఎదుగుదల దెబ్బతింటుందని అంటున్నారు. ఆవు పాలు తాగిస్తే రక్త హీనత కూడా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. విటమిన్ సీ(Vitamin C) లోపం వల్ల రోగనిరోధక శక్తి తగ్గిపోతుందని నిపుణులు చెప్తున్నారు. ఆవు పాలలో బిడ్డకు అవసరమైన పోషకాలు లేకపోవడమే కాకుండా... ఆవు పాలలో నీళ్లు కలపడం వల్ల బిడ్డకు సరైన మొత్తంలో కొవ్వు కూడా అందదు. దీంతో పిల్లలు ఆరోగ్యకరంగా ఉండరని అంటున్నారు. ఆవు పాలను తాగడం వల్ల పిల్లలు ఊబకాయం బారిన పడే అవకాశం ఉంది. ఆవు పాలలో ఫాస్ఫేట్, ప్రోటీన్ ఉంటుంది. దీని వల్ల పిల్లలు బరువు బాగా పెరిగిపోతారు. అలాగే శరీరంపై అదనపు కొవ్వు పేరుకుపోవడం వల్ల వారి ఎదుగుదల కూడా ఆగిపోతుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అయితే ఏడాది తర్వాత ఆవుపాలను తాపొచ్చని చెప్తున్నారు.