తలనొప్పి... వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని వేధించే సమస్య. పెద్దవారిలోనే.. టీనేజ్ పిల్లలు సైతం తలనొప్పితో బాధపడుతుంటారు. గత కొన్నేళ్లలో జీవన శైలిలో వచ్చిన మార్పుల కారణంగా అనేక రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. నిలకడలేని జీవితాలు.. ఒత్తిడి.. ఎక్కువగా ఆలోచించడం వల్ల తలనొప్పి వస్తుంది. అలాగే.. ఇటీవల చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు గంటలు గంటలు సోషల్ మీడియాలో మునిగిపోతున్నారు.

తలనొప్పి... వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని వేధించే సమస్య. పెద్దవారిలోనే.. టీనేజ్ పిల్లలు సైతం తలనొప్పితో బాధపడుతుంటారు. గత కొన్నేళ్లలో జీవన శైలిలో వచ్చిన మార్పుల కారణంగా అనేక రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. నిలకడలేని జీవితాలు.. ఒత్తిడి.. ఎక్కువగా ఆలోచించడం వల్ల తలనొప్పి వస్తుంది. అలాగే.. ఇటీవల చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు గంటలు గంటలు సోషల్ మీడియాలో మునిగిపోతున్నారు. దీంతో స్మార్ట్ ఫోన్ స్క్రీన్ కాంతి నేరుగా కళ్లపై పడడమే కాకుండా.. మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అలాగే స్మార్ట్ ఫోన్ ఎక్కువగా వాడేవారికి తలనొప్పి, మైగ్రేన్ సమస్యలు వేధిస్తుంటాయి. ఈ సమస్యను తగ్గించుకోవడానికి ఎన్ని రకాల ట్యాబ్లెట్స్ వాడినా.. ఎన్ని ప్రయత్నాలు చేసిన ఫలితం కనిపించదు. ఇక ఈ తలనొప్పి నుంచి భయటపడటానికి చాలా మంది ఒక కప్పు టీ ఉంటే చాలు అనుకుంటారు. నిజమే.. ఒక కప్పు అల్లం టీ తలనొప్పి మాత్రమే కాకుండా.. ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. ట్యాబ్లెట్స్ కు బదులుగా ఒక మంచి టీ తీసుకుంటే తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. కేవలం అల్లం టీ మాత్రమే కాదు.. మరిన్ని టీలు కూడా ఈ సమస్యను తగ్గిస్తాయంటున్నారు నిపుణులు.

దాల్చిన చెక్క టీ లేదా బాసిల్ టీ..
అంటారాలో కన్సల్టెంట్ వైద్యుడు, క్లినికల్ సర్వీసెస్ హెడ్ డాక్టర్ శిల్పికులశ్ట్రేష్ట ప్రకారం.. దాల్చిన చెక్క సహజమైన నొప్పి నివారిణిగా పనిచేస్తుంది. అంతేకాకుండా... తలనొప్పిని కూడా తగ్గిస్తుంది. దాల్చిన చెక్కతోపాటు కొంత నీటిని 10 నిమిషాలు వేడి చేయాలి. అలాగే మరోవైపు తులసి, పుదీనా ఆకులను ఒక కప్పులో వేసి దాని పైన దాల్చిన చెక్క న నీటిని పోసి 2 నిమిషాలు ఉండనివ్వాలి. ఇందుకు దాల్చిన చెక్క ఒకటి.. తులసి ఆకులు 3-4, పుదీనా.. 1-2 ఆకులు, నీరు 1.5 కప్పులు సరిపోతాయి.

లవంగాల టీ..
లవంగాలు తలనొప్పిని మాత్రమే కాదు ఒత్తిడిని, నరాల కణాల వాపును తగ్గిస్తుంది. అలాగే రక్తప్రసరణను మెరుగుపరచడమే కాకుండా దంతాల నొప్పిని తగ్గిస్తాయి. నీటిలో లవంగాలు, అల్లం ముక్కలు వేసి 2-3 నిమిషాలు వేడి చేయాలి. ఒక కప్పులో పుదీనా, నిమ్మకాయ ముక్క వేసి అందులో ఈ టీ పోయాలి. ఇది తలనొప్పిని తగ్గించడమే కాకుండా.. మిమ్మల్ని మరింత ఉత్సాహంగా చేస్తుంది. ఈ టీ చేసుకోవడానికి లవంగాలు 2, అల్లం ముక్కలు 2, పుదీనా 3,4 ఆకులు, నిమ్మకాయ ముక్క 1, నీరు - 1.5 కప్పులు అవసరమవుతాయి.

మందార టీ..
తలనొప్పిని తగ్గించడంలో ఈ మందార టీ బెస్ట్ అని చెప్పొచ్చు. అలాగే ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మందరా పువ్వును చల్లటి నీటితో కడగి ఆ తర్వాత వాటి రేకులను తీసి పక్కన పెట్టుకోవాలి. వాటి మొగ్గలు చేదు రుచిని కలిగి ఉండకూడదు గుర్తుపెట్టుకోండి. 300 మి. లీ నీటిని కలిపి వాటని గ్రైండర్లో వేసి పేస్ట్ లా చేయాలి. ఆ మిశ్రమాన్ని ఒక గాజు గ్లాస్ లో వేసి ఐస్ క్యూబ్స్ కలపాలి. అందులోనే నిమ్మరసం, పుదీనా, చక్కెరను కలిపి తీసుకోవాలి. ఈ టీ కోసం ఐదు మందార పువ్వులు సరిపోతాయి.

Updated On 4 Jun 2023 2:05 AM GMT
Ehatv

Ehatv

Next Story