బొహో కెఫేలో(Bohu Cafe) మాత్రం ఒక్క చాయ్ ధరలక్ష రూపాయలు
సాధారణంగా ఒక చాయ్(Tea) ధర రూ.10-20 ఉంటుంది. ఫైవ్ స్టార్ హోటల్‌లో మా అంటే రూ.500 వరకు కూడా ఉండొచ్చు. కానీ ఒక హోటల్‌లో చాయ్ ధర అక్షరాల లక్ష రూపాయలు. దుబాయ్‌లోని బొహో కెఫేలో(Bohu Cafe) మాత్రం ఒక్క చాయ్ ధరలక్ష రూపాయలు. దుబాయ్‌లోని ఎమిరేట్స్ ఫైనాన్షియల్ టవర్స్‌లో భారత సంతతికి చెందిన సుచేత శర్మ(Suchetha sharma) ఈ కెఫేను నిర్వహిస్తున్నారు. ఇందులో ‘గోల్డ్ కడక్’ చాయ్(Gold kadak chai) అమ్ముతున్నారు. ఈ చాయ్‌పైన ఒక గోల్డ్ లీఫ్(బంగారు పూత)ను పెడతారు. చాయ్‌తో పాటు తినడానికి బంగారం చల్లిన క్రోసెంట్ కూడా ఇస్తారు. చాయ్‌ను వెండి కప్పు, సాసర్‌లో ఇస్తారు. వీటిని చాయ్ తాగిన వారు తమతో పాటు తీసుకెళ్లొచ్చు. ఈ గోల్డ్ టీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘చాయ్ తాగడానికి ఈఎంఐ ఆప్షన్ ఉందా.. అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఎంత అదృష్టం ఉంటే ఈ చాయి తాగుతామని కామెంట్స్ చేస్తున్నారు.