హైదరాబాద్‌(Hyderabad) మహానగరం చాల వాటికి ప్రత్యేకం. మరీ ముఖ్యంగా బిర్యానీకి(Biryani) హైదరాబాద్‌ మస్తు ఫేమస్‌! హైదరాబాద్‌కు చుట్టపు చూపుగా వచ్చిన వారు చార్మినార్‌ను చూడకుండా(Charminar), బిర్యానీని తినకుండా వెళ్లరు. అసలు హైదరాబాద్‌ బిర్యానీ పేరు చెబితే చాలు నోట్లో నీళ్లు ఊరతాయి. ఆ ఘుమఘుమలకే కడుపు నిండిపోతుంది.

హైదరాబాద్‌(Hyderabad) మహానగరం చాల వాటికి ప్రత్యేకం. మరీ ముఖ్యంగా బిర్యానీకి(Biryani) హైదరాబాద్‌ మస్తు ఫేమస్‌! హైదరాబాద్‌కు చుట్టపు చూపుగా వచ్చిన వారు చార్మినార్‌ను చూడకుండా(Charminar), బిర్యానీని తినకుండా వెళ్లరు. అసలు హైదరాబాద్‌ బిర్యానీ పేరు చెబితే చాలు నోట్లో నీళ్లు ఊరతాయి. ఆ ఘుమఘుమలకే కడుపు నిండిపోతుంది. మామూలు రోజుల్లోనే బిర్యానీకి డిమాండ్‌ ఉంటుంది. అలాంటిది పవిత్ర రంజాన్‌ మాసంలో అయితే చెప్పనే అక్కర్లేదు. ఈ నెలలో హైదరాబాద్‌ వాసులు బిర్యానీని తెగ లాగించేశారు. ఈ నెలలోనే పది లక్షల బిర్యానీ ఆర్డర్లు వచ్చాయని ఫుడ్‌ డెలివరీ సంస్థ స్విగ్గీ అంటోంది. బిర్యానీ ఆర్డర్లలో దేశ వ్యాప్తంగా హైదరాబాద్‌ నంబర్‌ వన్‌ పోజిషన్‌లో ఉందని తెలిపింది. బిర్యానీతో పాటు హలీమ్‌(Haleem) ఆర్డర్‌లలోనూ హైదరాబాద్‌ ప్రజలు రికార్డు సృష్టించారని, ఈ ఒక్క నెలలోనే 5.3 లక్షల ఆర్డర్లు వచ్చయని పేర్కొంది. ఈ ఏడాది మార్చి 11వ తేదీన రంజాన్‌ మాసం ప్రారంభమయ్యింది. ఏప్రిల్‌ 11వ తేదీతో ముగిసింది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఫుడ్‌ డెలివరీ ఆర్డర్ల వివరాలను స్విగ్గీ ప్రకటించింది. ఈ ఒక్క నెలలోనే దేశవ్యాప్తంగా ఏకంగా 60 లక్షల పేట్ల బిర్యానీ ఆర్డర్లు డెలివరీ చేసినట్లు తెలిపింది. మిగతా నెలలతో పోలిస్తే రంజాన్‌ నెలలో బిర్యానీ ఆర్డర్లు 15 శాతం పెరిగాయని పేర్కొంది.రంజాన్ సందర్భంగా సాయంత్రం 5:30 గంటల నుంచి 7 గంటల మధ్య ఇఫ్తార్ ఆర్డర్‌లు 34 శాతం పెరిగినట్లు స్విగ్గీ వెల్లడించింది. మిగతా ఫుడ్‌ డెలివరీ సంస్థలు ఎన్ని బిర్యానీలను సప్లయ్‌ చేసిందో తెలియాల్సి ఉంది. అలాగే రెస్టారెంట్లకు వెళ్లి తినేవారి సంఖ్యను, ఇంటిపట్టున వండుకునే బిర్యానీల లెక్కలు తీస్తే మాత్రం అది ఇంకొన్ని లక్షలు అవుతుంది.

Updated On 11 April 2024 6:23 AM GMT
Ehatv

Ehatv

Next Story