ఈమధ్య అన్నింటికి నకిలీలు వచ్చేస్తున్నాయి. కూరలు పండ్లు హైబ్రీడ్ వచ్చినట్టు.. పాలు నకాలీవి తయారు చేసినట్టుగా జీడిపప్పు కూడా నకిలీవి తయారు చేయడంస్టార్ట్ చేశారు. కాని వాటిని నకిలీ అని కనిపెట్టడం ఎలా..?

ఈమధ్య అన్నింటికి నకిలీలు వచ్చేస్తున్నాయి. కూరలు పండ్లు హైబ్రీడ్ వచ్చినట్టు.. పాలు నకాలీవి తయారు చేసినట్టుగా జీడిపప్పు కూడా నకిలీవి తయారు చేయడంస్టార్ట్ చేశారు. కాని వాటిని నకిలీ అని కనిపెట్టడం ఎలా..?

ప్రస్తుతం దుకాణాల్లో నకిలీ జీడిపప్పు(Cashew Nuts) కూడా దొరుకుతోంది. మీరు కొనుగోలు చేస్తున్న జీడిపప్పు స్వచ్ఛమైనదా లేదా నకిలీదా అని తెలుసుకోవడానికి ఇక్కడ కొన్ని సాధారణ చిట్కాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం..

డ్రై ఫ్రూట్స్‌లో(Dry fruits) చాలా మంది జీడిపప్పు తినడానికి ఇష్టపడతారు. అనేక పోషకాలతో కూడిన జీడిపప్పు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కొందరు దీనిని తీపి వంటలలో కలుపుతుంటారు. కొందరు దీన్ని వేయించి తింటారు. మీరు అధిక ధరకు దుకాణంలో కొనుగోలు చేసిన జీడిపప్పులు చేదుగా అనిపిస్తే.. డబ్బు వేస్ట్ అయినట్టే కదా..?

జీడిపప్పు తింటున్నప్పుడు పళ్లకు అంటుకుంటే అది నకిలీ జీడిపప్పు అని అర్థం చేసుకోండి. అలాంటి జీడిపప్పు పళ్లలోంచి త్వరగా బయటకు రాదు. జీడిపప్పు తిన్న తర్వాత మీ దంతాలకు అంటుకోకపోతే, అది స్వచ్ఛమైన మరియు నిజమైన జీడిపప్పు.

జీడిపప్పు రంగు కాస్త పసుపు(Yellow) రంగులో ఉంటే అది నకిలీది. అయితే అది తెల్లగా ఉంటే అది స్వచ్ఛమైనది . స్వచ్చమైన జీడిపల్లు రుచిగా కూడా ఉంటుంది. తెల్ల జీడిపప్పు నాణ్యతలో కూడా అద్భుతమైనది. జీడిపప్పు కొనుగోలు చేసేటప్పుడు వాటిపై మచ్చలు, నలుపు, రంధ్రాలు ఉంటే వాటిని కొనకండి.

నిజమైన జీడిపప్పు త్వరగా పాడవదు. అదే సమయంలో, నాణ్యత లేని జీడిపప్పు త్వరగా కుళ్ళిపోతుంది. ఇందులో కీటకాలు ఉండవచ్చు. దీని రుచి కూడా చేదుగా మారుతుంది.

జీడిపప్పు ఒక అంగుళం పొడవు మరియు కొంచెం మందంగా ఉంటే, అది నిజమైన జీడిపప్పు అయ్యే అవకాశం ఉంది. దీని కంటే పెద్ద లేదా చాలా చిన్న జీడిపప్పు నకిలీ కావచ్చు. అలాగే జీడిపప్పు మరీ మందంగా ఉండకూడదు.

జీడిపప్పు మంచిదా లేక నకిలీదా అనేది వాసన ద్వారా కూడా తెలుసుకోవచ్చు.. కొనేప్పుడు ఓ రెండు మూడు జీడిపప్పులు వాసన చూడండి.. మంచి సువాసన వస్తాయి.. నకిలీ పప్పు జిడ్డు వాసన వస్తుంది. జాగ్రత్త పడండి.

Updated On 6 Feb 2024 7:31 AM GMT
Ehatv

Ehatv

Next Story