ఎండా కాలంలో(Summer) కూరగాయలు(Vegetables) త్వరగా పాడవుతుంటాయి. దీంతో కూరగాయల రుచి పోవడంమే కాకుండా వాటిలో పోషకాలు కూడా తగ్గిపోతాయి. అయితే కొన్ని టిప్స్‌(tips) పాటించడంతో పాటు జాగ్రత్తలు పాటిస్తే కూగాయలను వేసవిలో కూడా తాజాగా ఉంచుకోవచ్చని చెప్తున్నారు.

ఎండా కాలంలో(Summer) కూరగాయలు(Vegetables) త్వరగా పాడవుతుంటాయి. దీంతో కూరగాయల రుచి పోవడంమే కాకుండా వాటిలో పోషకాలు కూడా తగ్గిపోతాయి. అయితే కొన్ని టిప్స్‌(tips) పాటించడంతో పాటు జాగ్రత్తలు పాటిస్తే కూగాయలను వేసవిలో కూడా తాజాగా ఉంచుకోవచ్చని చెప్తున్నారు.
కడిగిన తర్వాత కూరగాయలను పొడిగా ఉంచాలి.. ఎందుకంటే అవి తడిగా ఉంటే తొందరగా పాడవుతాయంటున్నారు. కూరగాయలను కడిగిన తర్వాత పూర్తిగా ఆరిన తర్వాతే వాటిని ఫ్రిడ్జ్‌లో ఉంచండి. ఇలా చేస్తే కూరగాయలు ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి
రిఫ్రిజిరేటర్(Fridge) ఉష్ణోగ్రత ఎప్పుడూ 1-4 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంచాలి. ఈ ఉష్ణోగ్రత వల్ల కూరగాయలను తాజాగా ఉంచుతుంది. కూరగాయలను ఈ ఉష్ణోగ్రతలో ఉంచడం వల్ల అవి తాజాగా ఉండటమే కాకుండా రుచి, పోషకాలు కూడా ఉంటాయి. అందుకే ఫ్రిడ్జ్‌ ఉష్ణోగ్రతను సరిగ్గా సెట్ చేయడం చాలా ముఖ్యం. అంతేకాకుండా కూరగాయలను ఒకదానిపై ఒకటి పేర్చవద్దు. విడివిడిగా ఉంచాలని.. దీని వల్ల గాలి బాగా అందడంతో కూరగాయలు ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి.

టమాట, దోసకాయ వంటి కొన్ని కూరగాయలను రిఫ్రిజిరేటర్‌లో ఉంచకూడదు. వాటిని గది ఉష్ణోగ్రతలోనే ఉంచాలని సూచిస్తున్నారు. టమాట, దోసకాయలను చల్లని వాతావరణంలో ఉంచినట్లయితే అవి త్వరగా పాడవుతాయి. అందుకే వాటిని సాధారణ ఉష్ణోగ్రతలో ఉంచడం వల్ల ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి. పేపర్ టవల్‌లో కూరగాయలను చుడితే ఇది వాటి నుంచి అదనపు తేమను గ్రహిస్తుంది. అంతేకాకుండా ఎక్కువ కాలం వాటిని తాజాగా ఉంచుతుంది. ఈ చిట్కాలన్నీ ఎండాకాలంలో కూరగాయలను తాజాగా ఉంచడంలో సహాయపడతాయి. పోషకాలు కూడా ఉండడంతో ఆరోగ్యానికి మంచి చేస్తుందని నిపుణులు చెప్తున్నారు.

Updated On 2 May 2024 5:01 AM GMT
Ehatv

Ehatv

Next Story