డబ్ల్యూహెచ్‌వో (WHO)ప్రకారం భారతదేశంలో 14 ఏళ్ల మధ్య వయసు ఉన్న పిల్లల్లో 64 శాతం మంది నూలి పురుగుల (worm) బారిన పడే అవకాశం ఉందని నివేదికలు చెప్తున్నాయి

డబ్ల్యూహెచ్‌వో (WHO)ప్రకారం భారతదేశంలో 14 ఏళ్ల మధ్య వయసు ఉన్న పిల్లల్లో 64 శాతం మంది నూలి పురుగుల (worm) బారిన పడే అవకాశం ఉందని నివేదికలు చెప్తున్నాయి. దీంతో వీటి నివారణ కోసం ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. ఈ ఏడాది నుంచి పిల్లలకు మందులు ఇవ్వాలని నిర్ణయించారు. మాత్ర వేసుకున్న తర్వాత సాధారణంగా ఎటువంటి సమస్యలు ఉండవు. కానీ పురుగులు ఎక్కువగా ఉన్న పిల్లలకు మాత్ర వేసుకునేటప్పుడు కడుపునొప్పి, వాంతులు, దురద, శరీరంలో గడ్డలు రావడం జరుగుతుందని అంటున్నారు.

పిల్లల పేగుల్లోకి (intestine)ఈ నూలి పురుగులు చేరుతాయి. మలద్వారం చుట్టూ దురద, మలంలో పురుగులు, వాంతిలో పురుగులు, రక్తహీనత, బలహీనత, ఉత్సాహం లేకపోవడం, బరువు తగ్గడం, మలబద్ధకం(constipation), కడుపు నొప్పి మొదలైన లక్షణాలు ఉంటాయి. అలసట, రక్తహీనత, కడుపు నొప్పి, తల తిరగడం, వాంతులు, పోషకాహార లోపం, బరువు తగ్గడం, ఏకాగ్రత లోపించడం, విరేచనాలాంటివి వస్తాయి. సరైన సమయంలో చికిత్స అందకపోతే పిల్లలు మరింత అనారోగ్యానికి గురవుతారు.

మురికి మట్టిలో ఆడుకున్నప్పుడు, చెప్పులు వేసుకోకపోవడంతో పురుగులు లేదా గుడ్లు పిల్లల చేతులు, కాళ్ల ద్వారా పేగుల్లోకి చేరుతాయి. గోళ్లతో మలద్వారం చుట్టూ గోకడం వల్ల గుడ్లు, పురుగులు గోళ్లకు చేరుతాయి. చిన్నారులు గోళ్లు కొరికినా, చేతులు కడుక్కోకుండా తిన్నా పేగుల్లోకి పురుగులు చేరుతాయి. ఈగలు పురుగులు, గుడ్లను ఆహారంలోకి పంపుతాయి.

చిన్నారులు ఈ పురుగుల నుంచి తప్పించుకోవాలంటే ఇవి పాటించాలని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. పండ్లు, కూరగాయలను శుభ్రమైన నీటిలో (fruits wash)బాగా కడిగిన తర్వాత మాత్రమే వాటిని వాడాలి. భోజనానికి ముందు మలవిసర్జన తర్వాత సబ్బుతో మీ చేతులను బాగా కడగాలని చెప్తున్నారు(hand wash). మాంసాన్ని బాగా ఉడికించిన తర్వాతే తినాలి(proper cooking). ఎప్పటికప్పుడు పిల్లల గోళ్లను కత్తిరించి చేతులు శుభ్రంగా ఉంచాలని సూచిస్తున్నారు. బయటకు వెళ్తే పిల్లలకు తప్పనిసరిగా చెప్పులు వేసుకునేలా చూడాలి. ఆహారంపై మూతలు పెట్టి ఉంచాలని.. వేడి చేసిన నీటిని మాత్రమే తాగాలని సూచిస్తున్నారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతను (neatness)పాటించాలని.. 6 నెలలకు ఒకసారి నులిపురుగుల నివారణ మాత్రలు వేసుకోవాలని చెప్తున్నారు.

Updated On 11 Feb 2024 12:12 AM GMT
Ehatv

Ehatv

Next Story