పాలలో ఉండే హెల్దీ ప్రొటీన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. పైగా పాలు నిత్యం దొరుకుతూ ఉంటాయి. అయితే మీ పిల్లలు పాలు పెద్దగా తాగడం లేదా? అయితే ఇలా ట్రై చేసి చూడండి. వదిలిపెట్టమన్నా వదిలిపెట్టరు. పాలతో చేసే టేస్టీ స్వీట్ మిల్క్ కేక్ ఇది. పూర్తిగా పాలనే వాడుతాం కనుకు ఎదిగే పిల్లలకు చాలా బలం.పైగా దీన్ని సిద్ధం చేసుకోవడం చాలా అంటే చాలా సులభం. ఎలా చెయ్యాలో తెలుసుకుందామా?

ఎలా తయారు చేసుకోవాలి? కావాల్సిన పదార్థాలేంటీ?
పాలు - అర లీటర్, చక్కర - పావు కప్పు, నిమ్మరసం - 1 టీ స్పూన్, పిస్తా, బాదం, జీడిపప్పు పలుకులు - గుప్పెడు (అభిరుచిని బట్టి ఇతర డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు, నేతిలో దోరగా వేయించుకుని పెట్టుకోవాలి)

తయారు చేసుకునే విధానం?
కాస్త మందపాటి పాత్ర తీసుకుని అందులో పాలు పోసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి. మంట చిన్నదిగానే ఉంచుకుని పాలను బాగా మరిగించాలి. ఈ లోపు ఒక చిన్న గిన్నెలో నిమ్మరసం తీసుకుని.. అందులో కొద్దిగా నీళ్లలో కలిపి పక్కనే పెట్టుకోవాలి. పాలు మరుగుతున్నప్పుడు ఒక్కో చుక్క చొప్పను నిమ్మరసాన్ని అందులో వేసుకుంటూ బాగా కలుపుతూ ఉండాలి. ఒకేసారి మొత్తం పోస్తే పాలు విరిగిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి స్లోగా పోసుకుంటూ కలపాలి. పాలు బాగా చిక్కబడే వరకు దగ్గర పడే వరకూ ఇలా చేయాలి. పాలు చిక్కబడుతున్నప్పుడు అందులో పంచదార వేసుకుని.. కలుపుతూ ఉండాలి. కోవా మాదిరిగా అయ్యేంత వరకూ మరిగించాలి. కోవాలా దగ్గరకు చేరాక స్టవ్ ఆఫ్ చేసుకుని.. ఒక కేక్ మౌల్డ్‌ తీసుకుని.. దాని అడుగున నెయ్యి రాసి బాదం, పిస్తా ముక్కలు పొడిపొడిగా చల్లుకోవాలి. దానిలో ఈ కోవా మిశ్రమాన్ని పోసుకుని కాస్త చల్లారనివ్వాలి. ఇప్పుడు పైన నచ్చిన విధంగా గార్నిష్ చేసుకుని.. కట్ చేసుకుని తింటే అదిరిపోతుంది. ప్రోసెస్ మొత్తం చాలా ఈజీగా ఉంది కదూ? మరింకెందుకు ఆలస్యం.. వచ్చే ఆదివారం మీరూ ట్రై చేయండి. ఇక ప్రతివారం ఇదే చేయమని మీ పిల్లలు గోల చేయడం పక్కా మరి.

Updated On 25 April 2023 4:04 AM GMT
Ehatv

Ehatv

Next Story