వేసవి వచ్చిందంటే మామిడి పండ్లకు కొడవే ఉండదు. అలాగే వాటితో తయారు చేసుకునే రుచులకూ లోటుండదు. కాస్త ఓపిక ఉండాలే కానీ మామిడి పండ్లతో చాలా రెసీపీలు ట్రై చేయొచ్చు. రకరకాల పదార్థాలను కలిసి.. చాలా వెరైటీలు తయారు చేసుకోవచ్చు. అయితే ఈ స్పాంజ్ కేక్ చేసుకుని తింటే మాత్రం అస్సలు వదిలిపెట్టలేరు. పిల్లలకే కాదు పెద్దలకు కూడా ఇట్టే నచ్చేస్తుందీ కేక్. మరింకేం.. ఒకసారి ట్రై చేసి చూద్దామా?
వేసవి వచ్చిందంటే మామిడి పండ్లకు కొడవే ఉండదు. అలాగే వాటితో తయారు చేసుకునే రుచులకూ లోటుండదు. కాస్త ఓపిక ఉండాలే కానీ మామిడి పండ్లతో చాలా రెసీపీలు ట్రై చేయొచ్చు. రకరకాల పదార్థాలను కలిపి.. చాలా వెరైటీలు తయారు చేసుకోవచ్చు. అయితే ఈ స్పాంజ్ కేక్ చేసుకుని తింటే మాత్రం అస్సలు వదిలిపెట్టలేరు. పిల్లలకే కాదు పెద్దలకు కూడా ఇట్టే నచ్చేస్తుందీ కేక్. మరింకేం.. ఒకసారి ట్రై చేసి చూద్దామా?
ఈ కేక్ ని ఎలా తయారు చేసుకోవాలి? ఏమేమి కావాలి..?
మామిడి పండ్ల గుజ్జు - 1 కప్పు (బాగా తియ్యగా ఉండేలా చూసుకోవాలి) వెన్న- 5 టీ స్పూన్లు, పంచదార - 2 టీస్పూన్లు, కోడి గుడ్డు - 1, వెనిల్లా ఎసెన్స్ - 1 టీస్పూన్, మైదా పిండి - అర కప్పు, బేకింగ్ సోడా - 1 టీ స్పూన్, గోధుమ పిండి - 1టేబుల్ స్పూన్, చాకో చిప్స్ - 3 టేబుల్ స్పూన్లు, ఉప్మా రవ్వ - 1 టేబుల్ స్పూన్ రెడీగా దగ్గర పెట్టుకోవాలి.
తయారీ విధానం :
ఒక పాత్రలో మామిడి పండ్ల గుజ్జు పోసుకుని.. అందులో కోడిగుడ్ల సొన, 2 టీ స్పూన్ల వెన్న, పంచదార వేసుకుని పంచదార కలిగే దాకా కలుపుకోవాలి. ఆపైన దానిలో వెనిల్లా ఎసెన్స్ వేసి బాగా కలుపుకోవాలి. అలాగే మరో గిన్నె తీసుకుని.. అందులో గోధుమ పిండి, చాకో చిప్స్, మైదా పిండి, బేకింగ్ సోడా, ఉప్మా రవ్వ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని.. బాగా కలపాలి. అనంతరం మైదా మిశ్రమాన్ని.. మామిడి గుజ్జు మిశ్రమాన్ని ఒకే దానిలోకి వేసుకుని.. ఉండలు కట్టకుండా క్రీమ్‌లా కలిపేసుకోవాలి. అవసరం అయితే కొద్దిగా నీళ్లు పోసుకోవాలి. కేక్ మౌల్డ్‌లో కింద మొత్తం వెన్న రాసి.. ఈ మిశ్రమాన్ని అందులో పోసుకోవాలి. ఓవెన్ లో 180 డిగ్రీల సెట్ చేసి.. అందులో సుమారు 20 నిమిషాల బేక్ చేసుకోవాలి. అనంతరం సర్వ్ చేసుకునే ముందు.. కొబ్బరి కోరు, పంచదార పొడి లేదా క్రీమ్స్ వాడి.. నచ్చిన విధంగా గార్నిష్ చేసుకుని.. సర్వ్ చేసుకోవాలి. ఈ కేక్‌ని పిల్లలు చాలా ఇష్టంగా లాగించేస్తారు.