ఆకలిని పెంచడంలో అల్లం(Ginger) చేసే మేలు ఇంకే ఔషదం కూడా చేయదు. అంతేకాకుండా, ఈ ఔషదం అజీర్ణ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. పచ్చి అల్లం తినటం వలన లేదా మనం వండే వంటల్లో అల్లాన్ని చేర్చడటం వలన ఆకలి పెరుగుతుంది. రోజుకు ఒక్కసారి అయినా అల్లం టీ తాగటం వలన లాలాజలం శక్తివంతంగా మారుతుంది.

ఆకలిని పెంచడంలో అల్లం(Ginger) చేసే మేలు ఇంకే ఔషదం కూడా చేయదు. అంతేకాకుండా, ఈ ఔషదం అజీర్ణ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. పచ్చి అల్లం తినటం వలన లేదా మనం వండే వంటల్లో అల్లాన్ని చేర్చడటం వలన ఆకలి పెరుగుతుంది. రోజుకు ఒక్కసారి అయినా అల్లం టీ తాగటం వలన లాలాజలం శక్తివంతంగా మారుతుంది.

ఆకలి తగ్గడానికి చాలా రకాల కారణాలు ఉంటాయి... కొన్ని సందర్భాలలో, చాలా మంది వారి ఆకలిని కోల్పోతుంటారు. ఆకలి తగ్గటాన్ని వైద్య పరిభాషలో "అనోరేక్సియా" అనీ అంటారు. దీనిని సహజ ఔషదాల ద్వారా సులభంగా తగ్గించవచ్చు. ఆకలిని ఎలా పెంచుకోవాలి..
దాంతో జీర్ణక్రియ రసాలు ఉత్పత్తి అధికమమై, విపరీతంగా ఆకలి పెరుగుతుంది

ఆకలి పెరడగంలో నిమ్మ ఎంతగానో సహాయం చేస్తుంది. నిమ్మకాయ రసాన్ని పిండి లేదా సలాడ్'లలో కలిపుకొని తినటం వలన ఆకలి పెరుగుతుంది. లేదా రోజులో రెండు సార్లు రెండు గ్లాసుల నిమ్మరసం తాగటం వలన మీ ఆకలిని పెరుగుతుంది
-
కొత్తిమీర, పుదీనాలు కూడా జీర్ణక్రియ ఎంజైమ్'ల ఉత్పత్తిని అధికం చేసి, సహజ సిద్దంగా ఆకలిని పెంచుతాయి. రోజు ఉదయాన, ఖాళీ కడుపుతో ఒక గ్లాసు కొత్తిమీర, కాని పుదీనా కాని రసం(Mint Juice) తీసి ఆ రసాన్ని తాగటం వలన ఆకలి అధికంగా పెరుగుతుంది.

నల్ల మిరియాల(Black Peper)ను జీర్ణక్రియ శక్తిని పెంచే ఔషదంగా వాడతారు అని తెలిసిందే. రుచి గ్రాహకాలను ఉత్తేజపరచి, జీర్ణాశయంలో హైడ్రోక్లోరిక్ ఆసిడ్ (HCL) ఉత్పత్తిని పెంచి, జీర్ణక్రియను వేగవంతం చేయటం వలన, ఆకలిని పెరుగుతుంది.

దానిమ్మ పండు రసాన్ని తీసుకోండి. వద్దన్నా ఎక్కువ తినేస్తారు... అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్ మరియు విటమిన్'లను కలిగి ఉన్న దానిమ్మ పండు రసం జీర్ణక్రియ శక్తి ప్రేరేపించటమే కాకుండా, ఆకలిని కూడా మెరుగుపరుస్తుంది. ఈ రసంలో సగం చెంచా తేనెను కలుపుకోని తీసుకోండి ఆకలి పెంచడంతో పాటు తిన్న ఆహారం సక్రమంగా జీర్ణం అవ్వడానికి ఉపయోగపడుతుంది.

ఉసిని ఆకలిని పెంచే సహజ ఔషదం. ఉసిరి, జీర్ణక్రియ వ్యవస్థ యొక్క పని తీరును మరియు కాలేయాన్ని నిర్విషీకరణకు గురిచేసి ఆకలిని పెంచుతుంది. తేనె మరియు ఉసిరి కలిపినా లేదా ఉసిరితో తయారు చేసిన ఉరగాయను తినండం వలన ఆకలి పుడుతుంది. జీర్ణాశయం ఉత్తేజం చెందడం కోసం ఉసిరి ఉపయోగపడుతుంది.

Updated On 4 April 2023 2:37 AM GMT
Ehatv

Ehatv

Next Story