బాస్మతి బియ్యంతో(Basmati Rice) బిర్యానీ, పులావ్ వంటి వంటకాలు ఎక్కువగా చేస్తారు. బాస్మతి బిర్యానీ చూడటానికి, తినడానికి బాగుంటుంది. అయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి. వాసన చూసి మోసపోకండి. ప్రస్తుతం ఆహార పదార్థాలన్నీ కల్తీ అవుతున్నాయి.
బాస్మతి బియ్యంతో(Basmati Rice) బిర్యానీ, పులావ్ వంటి వంటకాలు ఎక్కువగా చేస్తారు. బాస్మతి బిర్యానీ చూడటానికి, తినడానికి బాగుంటుంది. అయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి. వాసన చూసి మోసపోకండి. ప్రస్తుతం ఆహార పదార్థాలన్నీ కల్తీ అవుతున్నాయి.
ది సెంటర్ ఫర్ DNA ఫింగర్‌ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ చేసిన తాజా అధ్యయనంలో మార్కెట్‌లలో విక్రయించే బాస్మతిలో 50 శాతం నకిలీ అని తేలింది. 495 బ్రాండ్‌ల బాస్మతి బియ్యం నమూనాలపై ఈ అధ్యయనం జరిగింది. ఈ అధ్యయనం 2021-22లో జరిగింది.
బాస్మతి బియ్యం వండడానికి ముందు మరియు తర్వాత దాని పొడవు మరియు వెడల్పును పరిశోధకులు స్పష్టంగా నిర్వచించారు. ఈ పరీక్షలో చాలా నమూనాలు పేర్కొన్న స్థాయిలను అందుకోలేదని అధికారులు తెలిపారు. నాసిరకం బియ్యంలో బాస్మతిని కలిపి విక్రయదారులు అధిక ధరలకు విక్రయిస్తున్నారు.
అసలైన బాస్మతి బియ్యం ధర ఎక్కువగా ఉండడంతో చాలా మంది విక్రయదారులు ఇతర రకాల బియ్యం బాస్మతిని కల్తీ చేస్తున్నారని సమాచారం.
దీంతో దేశీయ మార్కెట్‌లో బియ్యంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే బాస్మతి బియ్యం కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అసలు బాస్మతి బియ్యం ఏదో కనిపెట్టి కొనండి.
అసలైన బాస్మతీ రైస్ ను ఇలా కనిపెట్టవచ్చు.. అసలు బాస్మతి బియ్యం సైజులు.. చూసుకోవాలి.. వండడానికి ముందు బాస్మతి బియ్యం పొడవు(Grain height) 6.61 మి.మీ
వండడానికి ముందు బాస్మతి బియ్యం వెడల్పు 2 మిమీ కంటే తక్కువ వండిన తర్వాత బాస్మతి బియ్యం కనీస వెడల్పు - 3.50 మి.మీ వండిన బాస్మతి బియ్యం పొడవు - 12 మి.మీ వీటిని అందాజుగా చూసుకోగలిగితే చాలు.