బంగాళదుంప చిప్స్(Aloo Chips) అనగానే చాలా మంది నోరు ఊరుతుంది.. చిరుతిళ్లలో చిప్స్‌కి ప్రత్యేక స్థానం ఉంటుంది. బంగాళదుంప చిప్స్ పిల్లలు మరియు యువకులు బాగా ఆస్వాదిస్తుంటారు. ఇవి రకరకాల రుచుల్లో దొరుకుతుంటాయి. అయితే దుంపలు తినడం మంచిదేనా..? దుంపల వల్ల ఉపయోగాలు ఉన్నాయా.. నష్టాలు ఉన్నాయా...?

అదే సమయంలో దుంప విషయానికి వస్తే ఊబకాయం, లావు వంటి సమస్యల వల్ల.. 'అయ్యో' అని అరిచేవారూ ఉన్నారు. ఈ కారణంతో దినుసుకు దూరమయ్యేవారూ ఉన్నారు.
కానీ 'చాలా మందికి తెలియని విషయం ఏంటంటే..? గడ్డ దినుసుకు రక్తపోటును(Blood Pressure) తగ్గించే అద్భుతమైన సామర్థ్యం ఉందని పరిశోధకులు చెబుతున్నారు.
దుంపలను రోజుకు రెండు మూడు సార్లు తింటే శరీర బరువు పెరగదు. మరియు ఓట్స్ వంటి ఆహారపదార్థాలు తినడం వల్ల రక్తపోటు తగ్గుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
అమెరికాకు(america) చెందిన జోయ్ విన్సన్ అనే నిపుణుడి నేతృత్వంలోని బృందం సంబంధిత అధ్యయనాన్ని నిర్వహించింది.
ఈ అధ్యయనం కోసం దినుసును ఉపయోగించారు. నూనె లేకుండా మైక్రోవేవ్ ఓవెన్లో వండిన దినుసులను అధిక రక్తపోటు మరియు ఊబకాయంతో బాధపడేవారికి 2 నెలల పాటు రోజుకు 2 సార్లు ఇచ్చేవారు.
అనంతరం వారి రక్తపోటును తనిఖీ చేశారు. అప్పుడు వారి రక్తపోటు పడిపోయింది. వీరిలో ఎవరూ బరువు పెరగకపోవడం కూడా గమనార్హం.దుంపలలో కొన్ని మొక్కల ఆధారిత రసాయనాలు మరియు ఫైటోకెమికల్స్ అని పిలువబడే విటమిన్లు అధికంగా ఉంటాయి. ఇవి అధిక రక్తపోటును తగ్గించడానికి పని చేస్తాయి.
స్వీట్ పొటాటో ఫ్రెంచ్ ఫ్రైస్ మరియు చిప్‌లను అధిక వేడి వద్ద ఉడికించడం వల్ల యాంటీ ఇన్‌ఫ్లమేటరీ కెమికల్స్ మరియు ఫైటోకెమికల్స్ నాశనం అవుతాయి.