కార్లు, బస్సులు, విమానాల్లో ప్రయాణించే కొందరికి వికారం, తలనొప్పి(travel nausea) వంటి సమస్యలు రావడం సహజం. చాలా మందిలో ఈ సమస్య ఉంటుంది. మరి దాని నుంచి ఉపశమనం పొందడం ఎలా..?

కార్లు, బస్సులు, విమానాల్లో ప్రయాణించే కొందరికి వికారం, తలనొప్పి(travel nausea) వంటి సమస్యలు రావడం సహజం. చాలా మందిలో ఈ సమస్య ఉంటుంది. మరి దాని నుంచి ఉపశమనం పొందడం ఎలా..?

ప్రయాణిస్తున్నప్పుడు కొంతమందికి వికారం మరియు తలనొప్పి వంటి అనుభూతిని 'మోషన్ సిక్‌నెస్'(Motion sickness)గా సూచిస్తారు. మన అవయవాలు కదలిక సమయంలో మార్పుల వల్ల వస్తుంది. దాంతో దూర ప్రయాణం చేసేవారికి ఇది శారీరక అసౌకర్యాన్ని కలిగిస్తుంది.

ఈ సమస్య తలెత్తినప్పుడు, కొంతమంది తమ ప్రయాణాలను క్యాన్సిల్ చేసుకోవడం లాంటివి చేస్తుంటారు. అలా చేయకండి.. దూర ప్రయాణాలలో వికారం మరియు అనారోగ్యాన్ని నివారించడానికి కొన్ని సాధారణ చిట్కాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

ప్రయాణ సమయంలో దగ్గరగా ఉన్న వస్తువులను చూడటం మానుకోండి వాటి బదులుగా దూరంగా ఉన్న వస్తువులను చూడటానికి ప్రయత్నించండి. అదేవిధంగా, ప్రయాణంలో చిన్న వస్తువులను తదేకంగా చూడకుండా ఉండండి. ముఖ్యంగా పుస్తకాలు చదవడం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది.

కొందరికి పెట్రోలు(Petrol), డీజిల్ వాసనలు పడకపోవడం వల్ల ప్రయాణంలో వికారం వస్తుంది. మరికొంత మందికి ఏసీ(AC) వేసుకోవడం వల్ల వికారం వస్తుంది. అప్పుడు విండోస్ దించి బయటగాలిని పీల్చండి. సహజ గాలిని పీల్చడం ప్రయోజనకరంగా ఉంటుంది.

వివాహ వేడుకలు లేదా ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొన్న తర్వాత చాలా దూరం ప్రయాణిస్తున్నప్పుడు, కొంతమంది ఈ సమస్యను ఎదుర్కొంటారు. అలాంటి సందర్భాల్లో దారిలో ఎక్కడైనా కొన్నిగండలు విశ్రాంతి తీసుకుని మళ్లీ ప్రయాణం ప్రారంభించండి. దాని వల్ల చాలా వరకూ సమస్య పరిష్కారమవుతాయి.

ప్రయాణంలో కడుపునిండా తినకండి.. లైట్ ఫుడ్(Lite food) తినడం వల్ల కూడా ఈ వికారం నుండి బయటపడవచ్చు. ఇలా లైట్ ఫుడ్ తినడం వల్ల వాంతులు అవ్వకుండా నివారించవచ్చు. ఆల్కలీన్ ఆహారాలకు దూరంగా ఉండండి. అదే సమయంలో. శరీరం డీహైడ్రేషన్‌కు గురైతే చాలా ఇబ్బందిపడవలసి వస్తుంద.ి అప్పుడు తరచూనీరు తాగడం ఎంతో ఉత్తమం.

ప్రయాణంలో వికారంగా అనిపించే వారు ముందు వైపు సీట్లలో కూర్చోవాలి. రైళ్లలో, బస్సుల్లో కిటికీ సీట్లో కూర్చున్నా ఈ సమస్య నుంచి తప్పించుకోవచ్చు.మీరు ప్రయాణాల్లో నిశ్శబ్దంగా ఉండే బదులు మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో మాట్లాడటం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. అంటే, దృష్టిని మార్చడం ద్వారా ఈ సమస్యను నివారించడానికి ప్రయత్నించడం కూడా ఒక వ్యూహమే.

ప్రయాణంలో వికారంగా అనిపించే వారు చిన్న అల్లం ముక్కను నమలడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. అదేవిధంగా నిమ్మ పండును చేతిలో ఉంచుకుని వాసన చూడటం వల్ల కూడా ఈసమస్య నుంచి అధిగమించవచ్చు.

Updated On 5 May 2024 5:14 AM GMT
Ehatv

Ehatv

Next Story