మన జనాభాలో 12 శాతం మంది కిడ్నీ రాళ్లతో(Kidney stones) బాధపడుతున్నారని ఓ అధ్యయనంలో తేలింది. ఈ వ్యాధికి సరైన చికిత్స అందించకపోతే కిడ్నీ ఫెయిల్యూర్‌కు దారి తీసే అవకాశం ఉంది. కిడ్నీ రాళ్లలో నాలుగు ప్రధాన రకాలున్నాయి. కిడ్నీల్లో కాల్షియం, ఆక్సలేట్ రాళ్లు(Oxalate stone) ఎక్కువగా వస్తాయంటున్నారు. అధిక కాల్షియం(Calcium), ఆక్సలేట్(Oxalate) విసర్జన వల్ల ఇవి ప్రారంభమవుతాయని చెప్తున్నారు. మూత్ర కాల్షియం, ఆల్కలీన్ మూత్రం(Alkaline urine) కలయిక వల్ల కాల్షియం ఫాస్ఫేట్ రాళ్లు ఏర్పడతాయి.

మన జనాభాలో 12 శాతం మంది కిడ్నీ రాళ్లతో(Kidney stones) బాధపడుతున్నారని ఓ అధ్యయనంలో తేలింది. ఈ వ్యాధికి సరైన చికిత్స అందించకపోతే కిడ్నీ ఫెయిల్యూర్‌కు దారి తీసే అవకాశం ఉంది. కిడ్నీ రాళ్లలో నాలుగు ప్రధాన రకాలున్నాయి. కిడ్నీల్లో కాల్షియం, ఆక్సలేట్ రాళ్లు(Oxalate stone) ఎక్కువగా వస్తాయంటున్నారు. అధిక కాల్షియం(Calcium), ఆక్సలేట్(Oxalate) విసర్జన వల్ల ఇవి ప్రారంభమవుతాయని చెప్తున్నారు. మూత్ర కాల్షియం, ఆల్కలీన్ మూత్రం(Alkaline urine) కలయిక వల్ల కాల్షియం ఫాస్ఫేట్ రాళ్లు ఏర్పడతాయి. యూరిన్‌ ఆమ్లంగా ఉన్నప్పుడు యూరిక్ యాసిడ్(Ric acid) రాళ్లు ఏర్పడతాయి. ప్యూరిన్‌లతో కూడిన ఆహారం, జంతు ప్రోటీన్‌లో లభించే పదార్థాలు వల్ల యూరిక్ యాసిడ్‌ పెరుగుతుంది. దీని వల్ల యూరిక్‌ యాసిడ్‌ రాళ్లు ఏర్పడతాయంటున్నారు.

సరైన వైద్య చికిత్సతో పాటు తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వీటిని అరికట్టే అవకాశం ఉందంటున్నారు. మూత్రంలో కాల్షియం, ఆక్సలైట్ వంటి పదార్థాలు ఎక్కువగా ఉన్నప్పుడు కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. వీటిని నిరోధించాలంటే సరైన ఆహారం(Food) తీసుకోవాలి. అలాగే కొన్ని ఆహారాల వల్ల కూడా రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది. సిస్టీన్ స్టోన్స్ జన్యుపరమైన రుగ్మత వల్ల ఏర్పడుతాయంటున్నారు. మూత్ర పిండాల్లో రాళ్లను నివారించేందుకు రోజుకు 2.5 - 3 లీటర్ల నీటిని తాగాలని సూచిస్తున్నారు. కిడ్నీలో రాళ్లున్నవారు రోజుకు కనీసం 1.5 లీటర్ల మూత్రాన్ని విసర్జించేందుకు అవసరమైన ద్రవాలను తాగాలని చెప్తున్నారు. మాంసాహారాన్ని తగ్గిస్తే యూరిక్ యాసిడ్ రాళ్లు ఏర్పడకుండా నిరోధించవచ్చంటున్నారు.

మూత్రపిండాల్లో ఉన్న రాయి మూత్ర నాళంలోకి వచ్చినప్పుడు పొత్తికడుపులో నొప్పి ప్రారంభమవుతుంది. మూత్రపిండం, మూత్రాశయ కోలిక్ తీవ్రంగా నొప్పి ఉంటుంది. మూత్రాశయం వరకు రాయి చేరినపుడు పొత్తి కడుపులో నొప్పి, ఫ్రీక్వెన్సీ, డైసూరియా ఉంటాయి. మూత్రంలో రక్తం ఉండటం వల్ల వికారం వచ్చి వాంతులు చేసుకుంటే కిడ్నీలో రాళ్లున్నట్లు అన్న సంకేతాలు తెలుస్తాయంటున్నారు.

6mm కంటే తక్కువ పరిమాణంలో ఉన్న చిన్న రాళ్లు మందుల ద్వారా కరిగిపోతాయని వైద్యులు చెప్తున్నారు. మూత్రనాళాన్ని విస్తరించి ఇవి వెళ్లిపోయేందుకు మందులు ఉపయోగపడతాయి. ఇక 2 సెం.మీ. వరకు ఉండే రాళ్లను యూరిటెరోస్కోపి ద్వారా శస్త్రచికిత్స చేసి తొలగిస్తారు. చిన్న స్కోప్‌ రంధ్రం ద్వారా మూత్ర నాళంలోకి ఉంచుతారు. రాళ్లను లేజర్‌తో తొలగించి మూడు వారాల పాటు స్టెంట్‌ వేస్తామని వైద్యులు చెప్తున్నారు.

Updated On 2 Feb 2024 5:34 AM GMT
Ehatv

Ehatv

Next Story