భారతదేశం అనేక అద్భుతమైన మూలికలు మరియు సుగంధ ద్రవ్యాల నిధి. అందుకే వంటిల్లే వైధ్యశాల అన్నారు పెద్దలు. అందులో మసాలా దినుసుల(Spices) వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనం ఉంది అంటే.. అవి కలిగించే అద్భుతమైన ప్రయోజనాలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. అందులో మహాద్భుతమైన దివ్వ ఔషదం.. మరియు మసాలా దినుసు పేరు జాజికాయ.

ఒక చిన్న జాజికాయ(Nutmeg) మనకు సరైన రోగనిరోధక శక్తిని(Immune Power) ఎలా ఇస్తుందో మరియు మన జీవితంలోని ఇతర అంశాలను ఎలా మెరుగుపరుస్తుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. జాజికాయ సుగంధ ద్రవ్యం. కానీ ఈ మసాలా దినుసు మీ ఆహారాలను రుచికరంగా మార్చడమే కాదు.. వాసనతో మిమ్మల్ని ఆకర్షిస్తుంది. ఆరోగ్య పయోజనాలతో మనల్ని రక్షిస్తుంది కూడా.
జాజికాయ కామోద్దీపనగా కూడా పనిచేస్తుంది. దీనిని మహిళలకు వయాగ్రా(Viagra) కూడా పిలుస్తారు, ఆఫ్రికాలో నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం ఇది నిరూపించబడింది. అంతే కాదు BMC కాంప్లిమెంటరీ అండ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ జర్నల్‌లో ఈ విషయం ప్రచురించబడింది.
అంతే కాకుండా, శారీరక మరియు మానసిక ప్రశాంతతను మెరుగుపరచడానికి ఈ మసాలా ఉపయోగపడుతుంది. పురాతన కాలం నుంచి అనేక వ్యాధుల నివారణగా జాజికాయ ఉపయోగించబడుతుంది. ఆయుర్వేదం నుండి పురాతన వైద్యం వరకు, జాజికాయ నిద్ర, ఆరోగ్యం, రోగనిరోధక శక్తి లాంటివి మెరుగుపరచడానికి శక్తివంతమైన మసాలాగా ఉపయోగించబడుతుంది.
జాజికాయ మెగ్నీషియం, మాంగనీస్ మరియు రాగి వంటి ఖనిజాలతో మరియు B1, B6 వంటి అవసరమైన విటమిన్లతో నిండి ఉంటుంది. స్త్రీల ఆరోగ్యానికి చిటికెడు జాజికాయ ఎంతో ఉత్తమం. అందుకే జాజికాయ కొని ఉపయోగించండి. మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందండి.