గంగ నీరు పాడవదంటారు. నదిలో పారే నీరు రోజూ శుభ్రంగా ఉంటుందని అంటారు. ఇప్పుడు మినరల్ వాటర్‌ బాటిళ్లదే జోరు! ప్రయాణికులు కూడా నీళ్లు ఇంటి నుంచి నీళ్లు తీసుకెళడం లేదు. వాటర్‌ బాటిళ్లు కొనుక్కుంటున్నారు. అయితే క్లోజ్డ్‌ బాటిల్‌లోని(Water bottle) నీరు ఎన్ని రోజుల వరకు శుభ్రంగా ఉంటుంది

గంగ నీరు పాడవదంటారు. నదిలో పారే నీరు రోజూ శుభ్రంగా ఉంటుందని అంటారు. ఇప్పుడు మినరల్ వాటర్‌ బాటిళ్లదే జోరు! ప్రయాణికులు కూడా నీళ్లు ఇంటి నుంచి నీళ్లు తీసుకెళడం లేదు. వాటర్‌ బాటిళ్లు కొనుక్కుంటున్నారు. అయితే క్లోజ్డ్‌ బాటిల్‌లోని(Water bottle) నీరు ఎన్ని రోజుల వరకు శుభ్రంగా ఉంటుంది. దానికి ఎక్స్‌పైరీ డేట్‌ ఉండదా? ఎప్పుడా నీరు చెడిపోతుంది? ఈ సందేహాలు చాలా మందికి వచ్చే ఉంటాయి. మనం కొనే వాటర్‌ బాటిల్‌పై ఎక్స్‌పైరీ డేట్‌(Expiry date) ఉంటుంది. మీరందరూ చూసే ఉంటారు. ఒక నివేదిక ప్రకారం వాటర్‌ బాటిల్‌లోని నీటిని దాని ప్యాకింగ్‌ డేట్‌ నుంచి రెండేళ్ల పాటు వాడుకోవచ్చు. బాటిల్‌లోని ప్లాస్టిక్ నెమ్మదిగా నీటిలో కరగడం ప్రారంభిస్తుందట! అందుకే రెండేళ్ల తర్వాత ఆ నీటిని తాగకూడదని నిపుణులు చెబుతున్నారు. నిజానికి వాటర్‌ బాటిల్‌ గడువు తేదీ అందులోని నీరుకు సంబంధించింది కాదు. అది బాటిల్‌ గడువు తేదీ మాత్రమే! మనకు నల్లా నుంచి వచ్చే నీటిని ఆరు నెలల పాటు నిల్వ చేయవచ్చని వర్డ్‌ స్కూల్ ఆఫ్‌ పబ్లిక్‌ రీసెర్చ్‌ నివేదిక చెబుతోంది. అయితే కార్బోనేటెడ్‌ పంపు నీరు రుచి క్రమంగా మారుతుంది. ఎందుకంటే దానిలో నుంచి గ్యాస్‌ నెమ్మదిగా బయటకు వస్తుంది. గాలిలో ఉండే కార్బన్‌ డయాక్సైడ్ నీటిలో కలిసిన తర్వాత నెమ్మదిగా ఆమ్లంగా మారుతుంది. అంటే యాసిడ్‌లా అన్నమాట! అయితే కంటైనర్లను ఆరు నెలల పాటు చల్లని, పొడి, చీకటి ప్రదేశంలో ఉంచినట్లయితే ఆ నీటి రుచి ఎప్పటికీ మారదట! అయితే కంటైనర్లలోని నీటిని నింపేటప్పుడు మాత్రం పైపులను నేరుగా ఉపయోగించకూడదట! ఆల్టర్‌నేట్‌గా ఫిల్టర్‌ను వాడాలని చెబుతున్నారు. ఆ నీటికి గాలి తగలకుండా ఉండేందుకు గట్టిగా మూత బిగించాలని అంటున్నారు. నీటిని సుమారు పావుగంట పాటు మరిగించి తర్వాత చల్లబరిచి నిల్వ చేయవచ్చు.

Updated On 16 March 2024 1:10 AM GMT
Ehatv

Ehatv

Next Story