సమ్మర్ అదిరిపోతోంది. వేసవి తాపం రోజురోజుకూ పెరిగిపోతోంది. బయటకువెళ్లాలంటేనే భయపడుతున్నారు జానాలు. ఇక ఈ ఎండ వేడిమికి వేసవిలో శరీరంలో చర్మం దెబ్బతినడం దగ్గర్నుంచి కిడ్నీ సమస్యల వరకూ అన్నీ వస్తాయి. కాబట్టి, ఈ కాలంలో నీరు ఎక్కువగా తాగడం చాలా ముఖ్యం.

ఎండ వేడిని, వేసవి(Summer) తాపాన్ని తట్టుకోవడానికి చల్లటి ఐస్ వాటర్(Ice Water) తాగడం చాలా మందికి అలవాటు. కాని అది ఎంత వరకూ మంచిది.. ఐస్ వాటర్ వల్ల ఏమైనా సమస్యలు వస్తాయా..? చూద్దాం.

సమ్మర్ అదిరిపోతోంది. వేసవి తాపం రోజురోజుకూ పెరిగిపోతోంది. బయటకువెళ్లాలంటేనే భయపడుతున్నారు జానాలు. ఇక ఈ ఎండ వేడిమికి వేసవిలో శరీరంలో చర్మం దెబ్బతినడం దగ్గర్నుంచి కిడ్నీ సమస్యల వరకూ అన్నీ వస్తాయి. కాబట్టి, ఈ కాలంలో నీరు ఎక్కువగా తాగడం చాలా ముఖ్యం.

అయితే నీరు తాగాలి కాని.. చల్లని నీరు తాగాలా.. దాహం తీరుంతుందని చల్లని నీరు తాగడం మంచిదేనా.. లేదా రూమ్ టెంపరేచర్ కు మించి కాస్త కూల్ గా ఉన్న నీరు తాగడం మంచిదా.. ఎలాంటి నీరు తాగాలి..

సాధారణంగా ఎండలోకి వెళ్లిన తర్వాత మనం ముందుగా తాగేది చల్లటి నీళ్లే. చాలా మందికి ఇది అలవాటు. ఇలా చల్లటి నీరు తాగడం వల్ల వారికి మంచి అనుభూతి కలుగుతుంది. ఇది వేడిని కూడా తగ్గిస్తుంది. కానీ, ఇది స్వల్ప కాలానికి మాత్రమే ఉపశమనం కలిగిస్తుంది. మీకు తెలుసా.. వేసవిలో చల్లని నీరు తాగడం ఆరోగ్యానికి చాలా హానికరం. నమ్మినా నమ్మకపోయినా.. ఇది నిజం.

అయితే ఈ విషయం చాలా మందికి తెలియదు. ఇది మీ బరువు పెరగడమే(Weight gain) కాకుండా మీ గుండెను కూడా దెబ్బతీస్తుంది. కాబట్టి, వేసవి తాపాన్ని తట్టుకోవడానికి మీరు రెగ్యులర్‌గా చిల్ వాటర్‌ను తాగుతూ ఉంటే, అది కలిగించే కొన్ని తీవ్రమైన సమస్యల గురించి కూడా తెలుసుకోవడం ముఖ్యం.

వేసవిలో తరచుగా చిల్ వాటర్ తాగడం వల్ల మెదడు స్తంభించిపోతుంది(Brain Freeze). ఐస్ వాటర్ తాగడం, ఐస్ క్రీం తినడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది. నిజానికి, మెదడును ప్రభావితం చేసే వెన్నుపాములోని ఇంద్రియ నాడులను మంచు నీరు చల్లబరుస్తుంది. దీంతో తలనొప్పి(Headache), సైనస్ సమస్యలు వస్తాయి.

వేసవిలో చల్లని నీరు తాగడం వల్ల మీ జీర్ణవ్యవస్థలో సమస్యలు తలెత్తుతాయి. ఇలా ఎప్పుడూ తాగడం వల్ల ఆహారం జీర్ణం కాదు. ఇది కడుపు నొప్పి, వికారం మరియు మలబద్ధకం వంటి సమస్యలను కూడా కలిగిస్తుంది. శరీర ఉష్ణోగ్రతతో చల్లటి నీరు మారదు. దీంతో కడుపులోని ఆహారం జీర్ణం కావడం కష్టమవుతుంది.

వేసవిలో చల్లటి నీరు ఎక్కువగా తాగడం వల్ల గొంతు నొప్పి వస్తుంది. ఎందుకంటే ఇది అదనపు శ్లేష్మం ఉత్పత్తి చేస్తుంది. మరియు అది ఊపిరితిత్తులలో పేరుకుపోతుంది. ఇది ఇన్‌ఫ్లమేటరీ ఇన్‌ఫెక్షన్‌కు కారణమవుతుంది. కాబట్టి వీలైనంత వరకు వేసవిలో చల్లని నీరు తాగడం మానేయండి.

Updated On 13 April 2024 8:03 AM GMT
Ehatv

Ehatv

Next Story