తేనె(honey) వల్ల బోలెడు ప్రయోజనాలు ఉన్నాయని తెలుసు. కాకపోతే కొనే తేనె మంచిదా? కల్తీదా ? అన్నది కనిపెట్టడంలోనే ఇబ్బంది కలుగుతుంటుంది. స్వచ్ఛమైన తేనెను దొరకబుచ్చుకోవడం ఎలా?  దొరకబుచ్చుకోవచ్చు.. కాకపోతే అందుకోసం చిలీ(Chile) వరకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ భూమ్మీద అత్యంత స్వచ్ఛమైన తేనె అక్కడే దొరుకుతుంది మరి!

తేనె(honey) వల్ల బోలెడు ప్రయోజనాలు ఉన్నాయని తెలుసు. కాకపోతే కొనే తేనె మంచిదా? కల్తీదా ? అన్నది కనిపెట్టడంలోనే ఇబ్బంది కలుగుతుంటుంది. స్వచ్ఛమైన తేనెను దొరకబుచ్చుకోవడం ఎలా? దొరకబుచ్చుకోవచ్చు.. కాకపోతే అందుకోసం చిలీ(Chile) వరకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ భూమ్మీద అత్యంత స్వచ్ఛమైన తేనె అక్కడే దొరుకుతుంది మరి! ఆగ్నేయ పసిఫిక్‌(Southeast Pacific) మహా సముద్రం మధ్యలో ఓ ద్వీపం(Island) ఉంది. చిలీకి దగ్గరగా ఉన్న ఈ దీవిని ఈస్టర్‌ ఐలాండ్‌(Easter Island) అని పిలుస్తారు. ఆ ద్వీపంలో పెరిగే మొక్కలు, చెట్లపై ఎలాంటి పురుగుమందులు చల్లరు.
పూల మొక్కలు వాటికవే ఏపుగా పెరుగుతాయి. దాంతో అక్కడి తేనెటీగలకు ఎలాంటి వ్యాధులు సోకవు. ఆ కారణంగానే అవి ఈ భూమండలంలోనే స్వచ్ఛమైన తేనెను ఉత్పత్తి చేయగలుగుతున్నాయి. మనుషులు దూరని అడవుల సంగతి వదిలేస్తే మిగతా అన్ని చోట్ల విషపూరితమైన రసాయనాలు చల్లిన మొక్కలపైనే తేనెటీగలు వాలుతున్నాయ. దాంతో వాటికి కొత్త కొత్త వ్యాధులు అంటుకుంటున్నాయి. ఈస్టర్‌ ఐలాండ్‌ తేనెటీగలకు ఈ ప్రమాదం లేదు. వాటికి ఎలాంటి ముప్పుఉ వాటిల్లకుండా పెంపకం దారులు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇతర ప్రాంతాల నుంచి తేనెటీగలను దిగుమతి చేసుకోకుండా ప్రభుత్వాన్ని ఒప్పించగలిగారు.
ఇక్కడ తేనెటీగలు సురక్షితంగా పెరగడానికి రైతులే కారణం. వారు తమ పంటలకు ఎలాంటి పురుగు మందులు వాడరు. ఇప్పటికీ సంప్రదాయ పద్దతుల్లోనే సాగు చేస్తున్నారు. ఇక్కడ పారే నీరు కూడా చాలా స్వచ్ఛంగా ఉంటుంది. నీటి అవసరాలు ఎక్కువగా ఉంటే వర్షపు నీటిని నిల్వ చేసుకుంటారు. అందుకే తేనెటీగలకు ఎలాంటి జబ్బులు రావడం లేదని స్థానికులు అంటుంటారు. అన్నట్టు ఈస్టర్‌ ద్వీపంలోని తేనెటీగలు నిజంగానే అంత ప్రత్యేకమైనవా అన్న అనుమానం శాస్త్రవేత్తలకు కూడా కలిగింది. వెంటనే వారు రకరకాల పరిశోధనలు చేశారు.
ఆ పరిశోధనలో వారికి ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. ప్రపంచంలోని మిగతా ఏ తేనెటీగల జాతితోనూ వీటికి సంబంధం లేదట! ఇక్కడ పరాగ సంపర్కాలు జరిగే తీరు కూడా భిన్నంగానే ఉంటుందట! అందుకే ఈ అరుదైన జాతి తేనెటీగలను సంరక్షించడానికి ఇప్పుడు గట్టి చర్యలు తీసుకుంటున్నారు. ఈస్టర్‌ ద్వీపంలో పెరిగే తేనెటీగలు అత్యంత ఆరోగ్యవంతమైనవి మాత్రమే కాదు. వీటిలో ఉత్పాదక సామర్థ్యం కూడా ఎక్కువేనని సైంటిస్టులు అంటున్నారు. మరో ముఖ్య విషయమేమింటే ఇక్కడ అన్ని రుతువులు ఆమనిలాగే ఉండటం. అందుకే తేనెటీగలు రోజూ చురుగ్గా కదులుతుంటాయ. పూలపై వాలుతూ తేనెను సేకరిస్తాయి.
Updated On 23 Aug 2023 5:17 AM GMT
Ehatv

Ehatv

Next Story