మీ ఫేస్‌లో గ్లోరావాలంటే(Face glow) ఏం చేయాలి.. చాలా మంది చాలా రకాలుగా ఫేస్ గ్లో కోసం ప్రయత్నిస్తుంటారు. ఇప్పుడు మీ ఫేస్ గ్లో రావాలంటే అది మీచేతిలోనే ఉందంటున్నారు. ఇందులో భాగంగా ఓ చిరుతిండి(snack) ఇంట్లో తయారుచేసుకుంటే చాలు.
మీ ఫేస్‌లో గ్లోరావాలంటే(Face glow) ఏం చేయాలి.. చాలా మంది చాలా రకాలుగా ఫేస్ గ్లో కోసం ప్రయత్నిస్తుంటారు. ఇప్పుడు మీ ఫేస్ గ్లో రావాలంటే అది మీచేతిలోనే ఉందంటున్నారు. ఇందులో భాగంగా ఓ చిరుతిండి(snack) ఇంట్లో తయారుచేసుకుంటే చాలు. ఇందుకు కావాల్సినవి రెండే ఐటమ్స్. ఒకటి బెల్లం(jaggery), రెండు శనగలు(Chana). నిజం చెప్పాలంటే పూర్వకాలంలో దీనిని విరివిగా వాడే వారట. మీరు కూడా ఈ సూపర్‌ఫుడ్ కాంబినేషన్‌ని ఆహారంగా తీసుకొని మొహం తేజస్సుగా మార్చుకునే అవకాశం ఉందంటున్నారు.
బెల్లం, వేయించిన శనగలతో రుచికరమైన చిరుతిండిని తయారు చేసుకోవాలి. ఇది ఆరోగ్యాన్ని మెరుగుపర్చడమే కాకుండా, అందాన్ని పెంచుతుంది. పోషకాహార(Nutrious Food) నిపుణులు లీమా మహాజన్ ఈ ఆరోగ్యకరమైన చిరుతిండిని తయారు చేసే విధానాన్ని తెలిపారు. ఇది ప్రోటీన్, ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్ల పవర్‌హౌస్. ఇది గొప్ప చిరుతిండిగా కూడా ఉంటుంది. ముందుగా బెల్లాన్ని రోటిలో వేసుకొని దంచి, ఆతర్వాత ఓ గిన్నెలో వేసి అది కరిగేంత వరకు వేడిచేయాలి. ఆ తర్వాత వేయించిన శనగలను అందులో కలుపుకుంటే చాలు. లంచ్ చేసిన తర్వాత చిరుతిండి తినాలని సూచిస్తున్నారు.