ఈరోజుల్లో చిన్నా పెద్దా అంతా కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా కీళ్ల నోప్పులు(Knee Pains) ఎక్కువగా వస్తున్నాయి. ఈ క్రమంలో మనం తినే ఆహార పదార్ధాల తోనే కీళ్ల నొప్పులు.. కీళ్ల సమస్యల నుంచి ఉపశమనం పొందండి.

ఈరోజుల్లో చిన్నా పెద్దా అంతా కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా కీళ్ల నోప్పులు(Knee Pains) ఎక్కువగా వస్తున్నాయి. ఈ క్రమంలో మనం తినే ఆహార పదార్ధాల తోనే కీళ్ల నొప్పులు.. కీళ్ల సమస్యల నుంచి ఉపశమనం పొందండి.

కీళ్ల నొప్పులుతగ్గించడంలో అల్లం(Zinger) బాగా ఉపయోగపడుతుంది. మన వంటింట్లో ఉండే అల్లంలో.. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి, ఇవి కీళ్లలో మంట, నొప్పిని తగ్గించడానికి సహాయపడతాయి. కీళ్ల ఆరోగ్యం కోసం అల్లాన్ని రోజూ ఆహారంలో చేర్చండి. రోజు ఓ అల్లం టీ(zinger Tea) తాగినా సరిపోతుంది.

చేపల(Fish) వల్ల కూడా కీళ్ళ నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు. అది కూడా ఫ్యాటీ ఫిష్.. కొవ్వు ఎక్కువగా ఉన్న చేపల వల్ల ఈ ఉపయోగం ఉంటుంది. ముఖ్యంగా సాల్మన్, మాకేరెల్‌, సార్డినెస్ వంటి కొవ్వు చేపలలో ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్‌ పుష్కలంగా ఉంటాయి. వీటిలో యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. తద్వారా శరీరంలో మంట, వాపును తగ్గిస్తాయి. కీళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఉపయోగపడుతాయి.

పాలకూర, మెంతుకూర, తోటకూర వంటి ఆకుకూరల్లో విటమిన్‌ సి సమృద్ధిగా ఉంటుంది. విటమిన్‌ సి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది కొల్లాజెన్‌ ఉత్పత్తికి మద్దతు ఇస్తుంది. కీళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభించేలా చేస్తుంది.

వాల్‌నట్‌లు, అవిసె గింజలు, చియా గింజల్లో ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్‌, యాంటీఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి శరీరంలో మంటను తగ్గించి, కీళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి.అంతే కాదు నారింజ, నిమ్మ, ద్రాక్షపండు వంటి సిట్రస్ పండ్లలో కొల్లాజెన్ సంశ్లేషణకు అవసరమైన విటమిన్ సి అధికంగా ఉంటుంది. మీకు బలమైన కీళ్లు కావాలంటే ఇది చాలా అవసరం.

బ్రౌన్ రైస్, క్వినోవా, హోల్ వీట్ వంటి తృణధాన్యాలు ఫైబర్, సెలీనియం, మెగ్నీషియం వంటి పోషకాలను అందిస్తాయి. ఈ పోషకాలు శరీరంలో మంటను తగ్గిస్తాయి, మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.ఇక ఇవే కాకుండా.. పసుపు, బెర్రీ ప్రూట్స్.. గ్రీన్ టీ లాంటివి కూడా కాళ్లు.. కీళ్లు.. నొప్పుల నుంచి ఉపశమనం లభించేలా చేస్తాయి.

Updated On 31 July 2023 5:12 AM GMT
Ehatv

Ehatv

Next Story