రాష్ట్రంలోకి రుతుపవనాల(Mansoon) రాకా మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. ఓవైపు ఎండలు మండిపోతున్నాయి. ఈ సమయంలో జనాలు బయటకు రావాలంటే భయపడిపోతున్నారు. అత్యంత అవసరమైన పనులు ఉంటే తప్ప పెద్ద వారు బయటకు రావడానికి సాహసం చేస్తున్నారు. ఈ వేడి గాలుల కారణంగా అనారోగ్యానికి గురవుతున్నారు. ముఖ్యంగా కడుపు(Stomach) సంబంధించిన సమస్యలు అధికంగా ఉంటున్నాయి. ఈ హీట్ స్ట్రోక్(Heat Stroke) కారణంగా లూజ్ మోషన్(Loose motions) సమస్య వేధిస్తుంటుంది. వేసవిలో స్పైసీ ఫుడ్(spicy Food) తీసుకోవడం వలన, లేదా మిగిలిన ఆహారం(Left over food) తీసుకోవడం వలన విరేచనాలు వస్తాయి.

రాష్ట్రంలోకి రుతుపవనాల(Mansoon) రాకా మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. ఓవైపు ఎండలు మండిపోతున్నాయి. ఈ సమయంలో జనాలు బయటకు రావాలంటే భయపడిపోతున్నారు. అత్యంత అవసరమైన పనులు ఉంటే తప్ప పెద్ద వారు బయటకు రావడానికి సాహసం చేస్తున్నారు. ఈ వేడి గాలుల కారణంగా అనారోగ్యానికి గురవుతున్నారు. ముఖ్యంగా కడుపు(Stomach) సంబంధించిన సమస్యలు అధికంగా ఉంటున్నాయి. ఈ హీట్ స్ట్రోక్(Heat Stroke) కారణంగా లూజ్ మోషన్(Loose motions) సమస్య వేధిస్తుంటుంది. వేసవిలో స్పైసీ ఫుడ్(spicy Food) తీసుకోవడం వలన, లేదా మిగిలిన ఆహారం(Left over food) తీసుకోవడం వలన విరేచనాలు వస్తాయి. డీహైడ్రేషన్(Dehydration) కారణంగా తలనొప్పి, తల తిరగడం వంటి సమస్యలు వస్తాయి. సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే సమస్యలు మరింత తీవ్రతరమవుతాయి. అందుకే ఈ సమస్యను ఎక్కువ కాకముందే ఇంట్లోనే కొన్ని చిట్కాలతో తగ్గించుకోవచ్చు. అదేలాగో తెలుసుకుందామా.

పెరుగు(Curd0: విరేచనాల సమస్య ఇబ్బందిపెడుతుంటే పెరుగు తినడం మంచింది. .ఇందులో ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇవి పేగులలోని మంచి బ్యాక్టీరియాను పెంచడమే కాకుండా శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపడంలో సహాయపడతాయి. ఇది పొట్టకు చల్లదనాన్ని కూడా ఇస్తుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.

నిమ్మరసం(Lemon Juice): లూజ్ మోషన్ సమస్య ఉంటే నిమ్మరసం తీసుకోవాలి. నిమ్మకాయలో అసిడిక్ గుణాలు అలాగే యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉన్నాయి. ఇది డయేరియాకు కారణమయ్యే బ్యాక్టీరియాను తొలగించడంలో సహాయపడుతుంది. ఒక గ్లాసు నీటిలో నిమ్మకాయను పిండిన తర్వాత బ్లాక్ సాల్ట్ కలిపి తీసుకోవాలి. ఇది ఉపశమనాన్ని కలిగించడమే కాకుండా శరీరంలో డీహైడ్రేషన్ సమస్యను తగ్గిస్తుంది.

అరటిపండు(Banana): విరేచనాల సమస్యలో అరటిపండు తినడం కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దీనిలో ఫైబర్, పొటాషియం జీర్ణక్రియకు సరైనవి. అంతేకాకుండా పెక్టిన్ అనే మూలకం ఇందులో ఉంటుంది. ఇది కడుపుని శుభ్రం చేస్తుంది. అలాగే విరేచనాలను తగ్గిస్తుంది.

కొత్తిమీర టీ(Coriander tea): డయేరియా, కడుపు నొప్పి తగ్గించుకోవాలంటే కొత్తిమీర టీ తాగడం మంచిది. ఈ టీ టానిక్ లాగా పనిచేసి శరీరంలోని టాక్సిన్స్ ను కూడా తొలగిస్తుంది. టీ చేయడానికి, అర టీస్పూన్ కొత్తిమీర గింజలను తీసుకుని దానిని ఒక గ్లాసు నీటిలో కలిపి, కొద్దిగా మరిగించి, వడగట్టిన తర్వాత త్రాగాలి. కొత్తిమీర రెండింటిలోనూ చాలా గుణాలు ఉన్నాయి. విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె వంటివి పొట్టకు మేలు చేస్తాయి.

జీలకర్ర నీరు(Jeera Water): జీలకర్ర నీరు శరీరానికి ప్రయోజనాలను అందిస్తుంది. జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలకు ఇది దివ్యౌషధంలా పనిచేస్తుంది. ఇది యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంది. ముఖ్యంగా ఇది ప్రేగులలోని హానికరమైన బ్యాక్టీరియాను తొలగిస్తుంది. ఒక చెంచా జీలకర్ర వేయించి రుబ్బుకోని అందులో బ్లాక్ సాల్ట్ మిక్స్ చేసి గోరువెచ్చని నీటితో తాగాలి.

గమనిక: పైన ఇచ్చిన సూచనలను అనుసరించే ముందు డాక్టర్ లేదా సంబంధిత నిపుణుడి సలహా తీసుకోండి.

Updated On 11 Jun 2023 12:21 AM GMT
Ehatv

Ehatv

Next Story