గర్భిణీలకు(Pregnant Wife).. పెరుగుతున్నబిడ్డకు థైరాయిడ్(thyroid) వల్ల ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. అందుకే గర్భధారణ సమయంలో థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు వైద్య రంగ నిపుణులు.
గర్భిణీలకు(Pregnant Wife).. పెరుగుతున్నబిడ్డకు థైరాయిడ్(thyroid) వల్ల ప్రమాదం వచ్చే అవకాశం ఉంది. అందుకే గర్భధారణ సమయంలో థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు వైద్య రంగ నిపుణులు. ముఖ్యంగా ఇది పుట్టబోయే బిడ్డ శారీరక, మానసిక అభివృద్ధిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. గర్భధారణ సమయంలో థైరాయిడ్ సమస్యల ప్రభావాలను నివారించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే..
ప్రెగ్నెన్సీ సమయంలో మహిళల హార్మోన్లలో మార్పులు(Harmonal changes) వస్తాయి. దీనివల్ల చాలా మంది మహిళలు థైరాయిడ్ సమస్యలను ఎదుర్కొంటారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే గర్భధారణ సమయంలో డాక్టర్లు థైరాయిడ్ టెస్ట్ చేస్తారు. ఇప్పటికే థైరాయిడ్ సమస్య ఉంటే ప్రెగ్నెన్సీ సమయంలో కూడా క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలి. థైరాయిడ్ ఉన్నట్లు తేలితే వైద్యుల సూచనమేరకు చికిత్స చేసుకోవాలి.
ఆహారంపై(Food) చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. హైపర్ థైరాయిడ్‌తో బాధపడుతుంటే ఆహారంలో తగినంత ఉప్పును(Salt) ఉండేలా చూసుకోవాలి. అలాగే కూరగాయలు, పండ్లు ఆహారంలో చేర్చుకోవడం వల్ల థైరాయిడ్‌ను నియంత్రించొచ్చు. అలాగే హైపోథైరాయిడిజం సమస్యతో బాధపడుతున్న మహిళలు ఆహారంలో రాక్ సాల్ట్(Rock salt), తృణధాన్యాలు చేర్చుకోవాలి. ప్రెగ్నెన్సీ సమయంలో థైరాయిడ్‌ను అదుపులో పెట్టేందుకు డాక్టర్లు మందులను(Medicine) సిఫారసు చేస్తారు. అందుకే డాక్టర్ సూచించిన విధంగా మందులను మోతాదులోనే తీసుకోవాలని చెప్తున్నారు. అంతేకాకుండా ఒత్తిడికి దూరంగా ఉండాలంటున్నారు. ఎక్కువ ఒత్తిడి వల్ల థైరాయిడ్ సమస్య మరింత పెరుగుతుంది. అందుకే ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. వైద్యులు రాసిచ్చిన మందులను వాడుతూ.. ఆహారం, జీవనశైలిని సమతుల్యంగా ఉంచితే చాలా సులువుగా థైరాయిడ్‌ను తగ్గించొచ్చని చెప్తున్నారు.