ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అనే సామెత తెలిసిందే .... ఉల్లితో అంతటి అద్భుతమైన ఆరోగ్యం దాగి ఉందన్న మాట . ఆరోగ్యానికి ఉల్లిగడ్డ ఎంత మంచిదో చెప్పకనే చెబుతుంది. శరీరరంలో ప్రతి అవయువాన్ని శుద్ధి చేసేది ఉల్లిపాయ... ఉల్లిపాయ అందరి వంటింట్లో అందరికి అందుబాటులో ఉండేది ...అయితే ఈ ఉల్లిపాయలు శరీరానికి మేలు చేసే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కొన్ని వ౦దల ఏళ్లుగా ఈ ఉల్లిగడ్డలు మన ఆహారంలో ప్రధాన […]

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అనే సామెత తెలిసిందే .... ఉల్లితో అంతటి అద్భుతమైన ఆరోగ్యం దాగి ఉందన్న మాట . ఆరోగ్యానికి ఉల్లిగడ్డ ఎంత మంచిదో చెప్పకనే చెబుతుంది. శరీరరంలో ప్రతి అవయువాన్ని శుద్ధి చేసేది ఉల్లిపాయ... ఉల్లిపాయ అందరి వంటింట్లో అందరికి అందుబాటులో ఉండేది ...అయితే ఈ ఉల్లిపాయలు శరీరానికి మేలు చేసే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

కొన్ని వ౦దల ఏళ్లుగా ఈ ఉల్లిగడ్డలు మన ఆహారంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఇవి అందరికి అతి తక్కువ ధరకు దొరికేవి ...ఉల్లిగడ్డ జీర్ణవ్యవస్థ మెరుగుపరుస్తుంది. కళ్లకు మంచి టానిక్‌లా పనిచేస్తుంది. కీళ్లకు, గుండెకు కూడా మేలు చేస్తుంది. ఉల్లిగడ్డలు తినడం వల్ల బాడీలోని కొలెస్ట్రాల్ తగ్గడమే కాదు... రక్తపోటును అదుపులో ఉంచుతుంది. అంతేకాదు బ్యాక్టీరియా నుంచి వచ్చే అనేక ఇన్ఫెక్షన్స్, డయేరియా రాకుండా కాపాడుతుంది. మనషుల శరీరంలో ఉండే ఫ్రీరాడికల్స్ ను నివారించగల యాంటీఆక్సిడెంట్స్ ఇ౦దులో పుష్కలంగా ఉన్నాయి.

వేసవి కాలంలో రాత్రి పడుకునే ముందు పచ్చి ఉల్లిపాయ తినడం వల్ల వడదెబ్బ వచ్చే అవకాశం తక్కువ. దీనితో పాటు, పచ్చి ఉల్లిపాయలో వేసవిలో వేడి నుంచి రక్షించే గుణాలు ఉన్నాయి. ఉల్లిపాయను ఉత్తమ సహజ రక్త శుద్ధిగా పరిగణిస్తారు . జలుబుకు ఉల్లిపాయ చాలా మేలు చేస్తుంది . ఉల్లిపాయల్లో ఉండే విటమిన్ సి మరియు కాల్షియం నోటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి ముడి ఉల్లిపాయలో సల్ఫర్ పరిమాణం ఎక్కువగా ఉంటుంది. అనేక రకాల క్యాన్సర్ల నుండి రక్షించడంలో ఇది సహాయపడుతుంది.

పచ్చి ఉల్లిగడ్డ ప్రతిరోజూ 50 గ్రాముల మోతాదులో తింటే డయాబెటిస్ కంట్రోల్ అవుతుందని సైంటిస్టులు చేసిన పరిశోధనల్లో తెలిసింది. అంతే కాదు, ఉల్లిగడ్డ తినడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఉల్లిపాయ రసాన్ని అల్లం రసాన్ని సమపాళ్లలో తీసుకుని కలిపి తాగితే లైంగిక సామర్థ్యం పెరుగుతుంది. వెల్లుల్లి తర్వాత లైంగిక సామర్థ్యాన్ని పెంచే శక్తివంతమైన ఆహార పదార్థంగా ఉల్లిపాయ పనిచేస్తుంది. అంతే కాదు కాలిన గాయాలను నయం చేయడానికి ఉల్లిరసం సహాయపడుతుంది. కాలిన ప్రదేశంలో ఉల్లి రసాన్ని రాసుకుంటే కాలిన గాయాలకు చల్లదనాన్ని అందించి బొబ్బలను నిరోధిస్తుంది. కాలిన గాయాలకు ఇన్ఫెక్షన్లు రాకుండా ఉల్లిరసం అడ్డుకుంటుంది.

ఆర్థరైటిస్ నొప్పిలను తగ్గించే ఔషధంగా ఉల్లి రసం పనిచేస్తుంది. ఉల్లిపాయలోని యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు నొప్పి నివారిణిగా సహాయపడుతుంది. ఉల్లిరసంలో కొన్ని నువ్వుల గింజలు వేసి వేడి చేయాలి. ఈ ఉల్లిరసం గోరువెచ్చగా ఉన్నప్పుడు నొప్పులు ఉన్న ప్రదేశంలో అప్లై చేసుకోవాలి. ఇలా చేస్తే ఆర్థరైటిస్ నొప్పిల నుంచి విముక్తి కలుగుతుంది. ఇన్ఫెక్షన్ ల కారణంగా ఏర్పడే దగ్గులను తగ్గించడానికి ఉల్లిపాయ రసం చక్కగా సహాయపడుతుంది. ఇందుకోసం ఉల్లి రసాన్ని, తేనె రెండింటినీ సమపాళ్ళలో తీసుకొని బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని తాగడంతో దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది.

దంతక్షయాన్ని మరియు దంతాల్లోని ఇన్ఫెక్షన్స్ ను నివారించడానికి ఉల్లిపాయను ఎక్కువగా ఉపయోగిస్తారు. పచ్చి ఉల్లిపాయల ముక్కలను నోట్లో వేసుకొని 2-3 నిముషాలు నమలడం వల్ల నోటి నలమూలల్లో ఉన్న సూక్ష్మక్రిములు దంత సంబంధ క్రిముల్ని నశింప చేస్తాయి. పంటినొప్పితో బాధపడే వాళ్లు ఆ పంటికి లేదా చిగురుకు చేరువలో చిన్న ఉల్లిగడ్డను ఉంచుకుంటే కాసేపటికి ఆ నొప్పి తగ్గుతుంది. ఇన్నీ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఉల్లిపాయలను మన ఆహరం లో చేర్చుకోవాలి . అందుకే ఉల్లిపాయలను ఏదో ఒక రూపంలో నిత్యం తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని వైద్యులు చెబుతున్నారు.

Updated On 28 Feb 2023 6:01 AM GMT
Ehatv

Ehatv

Next Story