ఎండు ద్రాక్షలో(Kismis) ఫైబర్ అధికంగా ఉంటుంది. జీర్ణశక్తిని పెంచడంలో(Digestion) గ్రేట్ గా మెరుగుపడుతుంది. ఒక గ్లాసు నీటిలో `10 నుండి 12 ఎండు ద్రాక్షలను వేసి, రాత్రంతా నానబెట్టాలి. వీటిని మిక్సీలో పేస్ట్ చేసి ఉదయం నేరుగా పరగడుపున తీసుకోవడం వల్ల జీర్ణశక్తిపెరుగుతుంది.

ఎండు ద్రాక్షలో(Kismis) ఫైబర్ అధికంగా ఉంటుంది. జీర్ణశక్తిని పెంచడంలో(Digestion) గ్రేట్ గా మెరుగుపడుతుంది. ఒక గ్లాసు నీటిలో '10 నుండి 12 ఎండు ద్రాక్షలను వేసి, రాత్రంతా నానబెట్టాలి. వీటిని మిక్సీలో పేస్ట్ చేసి ఉదయం నేరుగా పరగడుపున తీసుకోవడం వల్ల జీర్ణశక్తిపెరుగుతుంది.

ఒక వ్యక్తి ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో 7 నుంచి 8 ఎండుద్రాక్షలను తింటే అతని జీర్ణవ్యవస్థ చక్కగా ఉంటుంది. మలబద్ధకం(Constipation) సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. ఒక వ్యక్తి ఎక్కువ కాలం మలబద్ధకంతో ఉంటే అతడికి పైల్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. నల్ల ద్రాక్షలో ఉండే ఫైబర్ మీ పొట్టకు మేలు చేస్తుంది.

తక్కువ కొవ్వుతో ఎండిన ద్రాక్షలు.. మీ చర్మం ఆరోగ్యానికి గొప్పవి. ఎందుకంటే అవి కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి. అంతేకాకుండా ఎండుద్రాక్షలో ఫినాల్(Phenol) అనే యాంటీఆక్సిడెంట్ నిండి ఉంటుంది. ఇది చర్మం(Skin) కొల్లాజెన్, కణాలు, ఎలాస్టిన్‌ను దెబ్బతీయకుండా ఫ్రీ రాడికల్స్‌ను నిరోధిస్తుంది. అవి మచ్చలు, చక్కటి గీతలు, ముడతలు(Wrinkles) వంటి వృద్ధాప్య సంకేతాలను కూడా ఆలస్యం చేస్తాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు మీ చర్మాన్ని బొద్దుగా చేసి పునరుజ్జీవింపజేస్తాయి.

ఎండు ద్రాక్షలో ఉండే పీచు ఉండటం వల్ల కడుపులోని నీటిని పీల్చేస్తుంది. తద్వారా విరేచనాలు, ఉదర సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది.
ఎండు ద్రాక్షలో.. యాంటీయాక్సిడెంట్లు, పీచు పదార్థం ఉండటం వల్ల రక్తహీనతను దూరం చేస్తుంది. అలాగే జీర్ణక్రియను మెరుగుపర్చే శక్తి ద్రాక్షలో ఉంది. క్రమం తప్పకుండా రోజు ఐదారు తిసుకుంటే చిన్న పేగుల్లో ఉండే వ్యర్థ పదార్థాలను బయటకు పంపించేస్తుంది.

నలుపు ఎండుద్రాక్ష తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీని ఉపయోగం అధిక BP ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇది శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిని కంట్రోల్‌లో ఉంచుతుంది. ఎండుద్రాక్షలో ఒలియానోలిక్ అనే ఫైటోకెమికల్ ఉంటుంది. ఇది మీ దంతాలను కుళ్లిపోకుండా కాపాడుతుంది. వాటిని బలంగా చేస్తుంది. అవి మీ దంతాలను కావిటీస్, పెళుసుగా రాకుండా కూడా రక్షిస్తుంది. ఇవి నోటిలో బ్యాక్టీరియాను వృద్ధి కాకుండా నిరోధిస్తాయి.

Updated On 17 Sep 2023 12:10 AM GMT
Ehatv

Ehatv

Next Story