కలోంజీ(Kalonji).. అంటూ నార్త్ ఇండియాలో.. నల్ల జీలకర్ర(Black Cumin Seeds) అంటూ మన దగ్గర ప్రేమగా పిలుచుకుంటారు.. దాని వల్ల ఎన్నిఆరోగ్య ప్రయోజనాలు(Health benefits) ఉన్నాయో తెలుస్తే.. రోజు ఒక్కసారి అయినా వాడకుండా ఉండలేరు. ఇంతకీ నల్ల జీలకర్ర వల్ల ఉపయోగాలు ఏంటో తెలుసా..?

మతిమరుపును నల్ల జీలకర్ర దూరం చేస్తుంది. జ్ఞాపకశక్తిని(Memory Power) పెంచుతుంది. కాళీ కడుపునా నల్ల జీలకర్రను తీసుకున్నట్లైతే మెమరీ పవర్ పెరుగుతుంది , ముఖ్యంగా వయసైనా వారికి ఎంతగానో ఉపయోగ పడుతుంది. పిల్లలకు కూడా బాగా ఉపయోగపడుతుంది.
జీర్ణశక్తి పెరగడంలో నల్ల జీలకర్ర పాత్ర అద్భుతమైనది. ర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది, పొట్టలో రసాయనాలు విడుదలయ్యేందుకు సహాయ పడుతూ, మలబద్ధకాన్ని నివారిస్తుంది. కొలెస్ట్రాల్ పెరగనివ్వకుండా నివారిస్తూ, లావు , ఉబ్బసం వంటి సమస్యలను అదుపు చేస్తుంది.
ఆడవారి నెలవారి క్రియలో(Periods) కడుపు నొప్పి, ఇర్రేగులర్ సైకిల్ వళ్ళ ఎన్నో ఇబ్బందులు పడుతారు, నల్ల జీలకర్ర నూనె వాళ్ళ ఇలాంటి సమస్యలను దూరం చెయ్యవచ్చు. బ్లడ్ ఫ్లో ని పెంచుతుంది, ఫెర్టిలిటీ రాట్ ను పెంచుతుంది.
నల్ల జీలకర్ర నూనె పంటికి సంబంధించిన సమస్యలను, చిగుళ్ళకి సంబంధించిన సమస్యలను, బలహీనమైన పంటి నొప్పిని తగ్గిస్తుంది,కేవలం కొన్ని నూనె చుక్కలను జల్లడంతో నొప్పి తగ్గుతుంది. నల్ల జిలకరలో థైమోక్విన్ అనే కెమికల్ ఉంటుంది అదే మీ చిగుళ్లను ఆరోగ్యగా ఉంచుతుంది.
నల్ల జీలకర్రలో యాంటీ – ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇవి బ్రెస్ట్ కాన్సర్, సెర్వికల్ కాన్సర్ , లంగ్ కాన్సర్, పాంక్రియాటిక్ కాన్సర్ లను నివారిస్తాయి.నల్ల జీలకర్ర నూనెని పాలతో తీసుకున్నపుడు శరిరంలో ని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తూ , గుండెకి సంబంధించిన సమస్యలని తగ్గిస్తుంది.