చాలా మంది కూరలో కర్వేపాకు(Curry Leaf).. కూరలో కొత్తిమీరను(Coriander) పక్కన పెట్టేస్తుంటారు. మరికొంత మంది కొత్తి మీర ప్లేవర్ తగిలితేనే తినడం మానేస్తుంటారు. కాని కొత్తిమీర వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు మరి. ఇంతకీ కొత్తిమీరతో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయంటే...?

ఆహారానికి రుచితో పాటు.. ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది కొత్తిమీర. మంచి ప్లేవర్ తో పాటు.. హెల్త్ బెనిఫిడ్స్ ఎన్నో ఉన్నాయి కొత్తిమీరలో. కొత్తిమీరలో విటమిన్ సి,ఎ,ఇతో పాటు కెరోటినాయిడ్స్ ఫుష్కలంగా ఉంటాయి. అవి అనారోగ్యాలనుదరిచేరనివ్వవు.

కొత్తిమీరలో కంటికి మంచి చేసే గుణం ఉంది.. కంటిసమస్యలను దూరం చేస్తుంది. అంతే కాదు మానవ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది కొత్తిమీర. అంతే కాదు జీర్ణక్రియనుమెరుగు(Digestion) చేస్తుంది. కడుపులో ఇన్ఫెక్షన్స్ ను తగ్గిస్తుంది.

కొత్తి మీరతో జూస్ చేసుకుని తాగండి..బ్లడ్ షుగర్ పారిపోతుంది. రక్తంలో కొవ్వును తగ్గిస్తుంది. అంతే కాదు దీనిలో ఉండే కాల్షియం, మాంగనీస్, పాస్పరస్ లాంటివాటి వల్ల ఎముకలు గట్టిపడి.. బలంగా తయారవుతాయి. వృధ్యాప్యంలో కూడా ఎముకలు బలంగా ఉంటాయి.

కొత్తిమీర కడుపుకు చాలామంచిది. అది కడుపులో ఇన్ ఫెక్షన్(Stomach Infection) తో పాటు.. పేగు కాన్సర్ నుంచి రక్షిస్తుంది. కడుపు నొప్పిని కూడా నివారిస్తుంది. రక్తంలో చక్కర స్థాయిని తగ్గించడంలో కొత్తి మీర బాగా ఉపయోగపడుతుంది. అంతే కాదుగుండె జబ్బులు రాకుండా చూస్తుంది.

రక్తాన్ని శుద్ది చేసి.. రక్తంలో కొవ్వు నిలవలు కరిగించి... గుండె పోటు ప్రమాదం తగ్గిస్తుంది కొత్తిమీర. అందుకే కొత్తిమీరను తినండి.. ఆరోగ్యంగా ఉండండి..

Updated On 9 May 2024 7:28 AM GMT
Ehatv

Ehatv

Next Story