తులసి(Tulsi).. హిందూ సంప్రదాయంలో దేవతగా పూజిస్తారు. అత్యంత పవిత్రంగా ఈ మొక్కను ఆరాధిస్తారు. ఉదయాన్నే ఇంటిని శుభ్రం చేసి దైవారాధన చేసిన తర్వాత తులసి ముంది దీపం వెలిగిస్తారు. ఈ మొక్కను ఇంట్లో పెట్టుకోవడం చాలా శుభప్రదంగా భావిస్తారు. కేవలం పూజించడమే కాదు.. ఇందులో ఎన్నో ఔషధ(Medicine) గుణాలు కూడా ఉన్నాయి.

తులసి(Tulsi).. హిందూ సంప్రదాయంలో దేవతగా పూజిస్తారు. అత్యంత పవిత్రంగా ఈ మొక్కను ఆరాధిస్తారు. ఉదయాన్నే ఇంటిని శుభ్రం చేసి దైవారాధన చేసిన తర్వాత తులసి ముంది దీపం వెలిగిస్తారు. ఈ మొక్కను ఇంట్లో పెట్టుకోవడం చాలా శుభప్రదంగా భావిస్తారు. కేవలం పూజించడమే కాదు.. ఇందులో ఎన్నో ఔషధ(Medicine) గుణాలు కూడా ఉన్నాయి. దీని ఆకులను తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. తులసి ఆకులను కషాయాలను తయారు చేసి తాగోచ్చు. ఖాళీ కడుపుతో(Empty stomach) తులసి ఆకులను నమలడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. విటమిన్ ఎ(Vitamin A), విటమిన్ కె(Vitamin K), కాల్షియం(Calcium), ఐరన్(IRON), మాంగనీస్(Manganese), మెగ్నీషియం(Magnesium), జింక్(zinc), పొటాషియం(Pottasium) వంటి పోషకాలు తులసి ఆకులలో లభిస్తాయి. తులసిలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవెంటో తెలుసుకుందాం.

ఒత్తిడిని(Stress) తగ్గిస్తుంది.. హెల్త్‌లైన్‌లో ప్రచురించిన ఒక వార్త ప్రకారం తులసిలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మానసిక ఆరోగ్యానికి తులసి ఆకులు చాలా మంచివి. తులసి ఆకులను ఉదయం ఖాళీ కడుపుతో తింటే ఒత్తిడి తగ్గుతుంది.

బ్లడ్ షుగర్(Blood Pressure) కంట్రోల్.. తులసి ఆకులలో అనేక యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని రోజూ తినడం వల్ల బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు తులసి ఆకులను తీసుకోవడం చాలా మంచిది.

ఇమ్యూనిటీ బూస్టర్(Immunity Booster).. తులసి ఆకులను తినడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా శరీరానికి శక్తినిస్తుంది. అలాగే ఇందులో యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉన్నాయి. ఇవి శరీరాన్ని అనేక రకాల ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తాయి.

అలసట, నొప్పి నుండి ఉపశమనం.. తులసి ఆకులను తీసుకోవడం వల్ల జ్వరం, నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. ఇందులో చాలా యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఫలితంగా అలసట, నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది.

చర్మానికి(Skin) మేలు చేస్తుంది.. తులసి ఆకులు మొటిమలను తొలగిస్తాయి. వీటిని ఫేస్ మాస్క్ గా ఉపయోగించడం వలన బ్లాక్ హెడ్స్, మచ్చలు తొలగిస్తుంది. అలాగే చర్మంలో దురద, మంట నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది.

Updated On 15 Jun 2023 11:56 PM GMT
Ehatv

Ehatv

Next Story