గత ఏడాదితో పోల్చితే ఈసారి ధరలు భారీగా పెరగనున్నట్లు తెలుస్తోంది. గతంలో హలీం ప్లేట్ కనీస ధర 30 రూపాయలుగా
రంజాన్ నెల అంటే చాలు.. హలీం కోసం ప్రజలు క్యూ కడుతూ ఉంటారు. రంజాన్ ప్రారంభానికి కేవలం నెల రోజులు మాత్రమే ఉంది. ఇక హలీమ్ కోసం పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి హోటళ్లు సన్నద్ధమవుతున్నాయి. హైదరాబాద్ లోని ప్రతి వీధుల్లో హలీం ఘుమఘుమలు ఉండనున్నాయి. అయితే, ఈ సంవత్సరం హలీం ధరలలో పెరుగుదల కనిపించే అవకాశం ఉంది.
గత ఏడాదితో పోల్చితే ఈసారి ధరలు భారీగా పెరగనున్నట్లు తెలుస్తోంది. గతంలో హలీం ప్లేట్ కనీస ధర 30 రూపాయలుగా ఉండగా.. ఈసారి 40 రూపాయలకు పెంచాలని నిర్ణయించారు. హలీం క్లాసిక్ బౌల్ 200 నుంచి 250 రూపాయలు వరకు ఉంది. ఈ సారి 300 రూపాయల వరకు ఉంటుందని హోటల్స్ సంకేతాలు ఇచ్చేశాయి. అయితే ఒక్కో హోటల్ లో ఒక్కో ధర హలీం ప్లేట్ ఉంటుంది. హలీం తయారీకి ఉపయోగించే చికెన్, మటల్ ధరలు పెరగటంతోపాటు.. అందులో ఉపయోగించే డ్రైఫ్రూట్స్, నెయ్యి, కోడి గుడ్లు, ఇతర సుగంధ ద్రవ్యాల ధరలు.. గత ఏడాదితో పోల్చితే భారీగా పెరిగాయని.. అందుకే హలీం ధరలను పెంచక తప్పటం లేదని హోటల్స్ నిర్వాహకులు చెబుతున్నారు. హలీం ధరలపై ప్రతి సంవత్సరం హోటల్స్ మేనేజ్ మెంట్ సభ్యులు భేటీ అయి.. కనీస ధర, అత్యధిక ధరను నిర్ణయిస్తారు. ఈసారి కూడా అలాగే భేటీ అయిన సభ్యులు గతంలో ఉన్న కనీస ధర 30 రూపాయలను, 40 రూపాయలకు పెంచాలని నిర్ణయించారు. హోటల్ మేనేజ్‌మెంట్‌ల నుండి అధికారిక ధరకు సంబంధించిన ప్రకటనలు రావాల్సి ఉంది. అయితే గత సంవత్సరం, క్లాసిక్ హలీమ్ ధర రూ. 200 - రూ. 250 మధ్య ఉంది. ఫుడ్ అగ్రిగేటర్ యాప్‌ల ద్వారా ఆర్డర్ చేసే కస్టమర్‌లు అధిక ధరకు హలీంను కొంటూ ఉంటారు