H3N2 వైరస్ దేశంలో విస్తృతంగా వ్యాప్తి చెందుతుంది . గత కొద్దికాలంగా ఈ వైరస్ కి సంబందించిన కేసు లు వెలుగు లోకి రావటంతో తిరిగి ప్రజలు మల్లి మాస్క్ ల తో జాగ్రత్తలు పాటిస్తున్నారు .అలాగే ఇప్పటికే ఈ వైరస్ వలన రెండు మరణాలు కూడా నమోదు కావటం జరిగింది. ఇప్పుడు ఎక్కడ చూసిన H3N2 వైరస్ గురించి చర్చ జరుగుతుంది . మరి ఈ వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుంది ?ఈ వైరస్ లక్షణాలు […]

H3N2 వైరస్ దేశంలో విస్తృతంగా వ్యాప్తి చెందుతుంది . గత కొద్దికాలంగా ఈ వైరస్ కి సంబందించిన కేసు లు వెలుగు లోకి రావటంతో తిరిగి ప్రజలు మల్లి మాస్క్ ల తో జాగ్రత్తలు పాటిస్తున్నారు .అలాగే ఇప్పటికే ఈ వైరస్ వలన రెండు మరణాలు కూడా నమోదు కావటం జరిగింది. ఇప్పుడు ఎక్కడ చూసిన H3N2 వైరస్ గురించి చర్చ జరుగుతుంది . మరి ఈ వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుంది ?ఈ వైరస్ లక్షణాలు ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం !

H3N2 వైరస్ ఎలా వ్యాప్తి జరుగుతుంది ?
ఈ వైరస్ తుమ్మినప్పుడు ,దగ్గినప్పుడు ,మాట్లాడినపుడు వచ్చే తుంపర్ల ద్వారా వ్యాప్తి చెందుతుంది .ఈ తుంపర్లు నీరు శ్వాస నాళాల్లో చేరుకొనే అవకాశం ఉంది . ఉపరితలాలు మీద ఉన్న ఈ వైరస్ ని ముట్టుకోవటం ద్వారా ఒక మనిషి నుండి మరొకరికి చేరుతుంది .కాబట్టి ప్రధానంగా మాస్క్ ధరించాలి తరచూ శానిటైజ్ చేసుకోవాలి . సామాన్యంగా అతి చలి నుంచి వెచ్చని వాతావరణంలోకి మారడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు కనిపిస్తాయి నార్మల్ ఫ్లూ మాదిరిగానే దేని లక్షణాలు ఉన్నపటికీ పిల్లలు,ముసలి వారిలో ఈ వైరస్ ప్రభావం ఎక్కువుగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు వైద్యనిపుణులు .

H3N2 వైరస్ లక్షణాలు :
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది,
ఛాతీ నొప్పి లేదా అసౌకర్యం,
నిరంతర జ్వరం మరియు గొంతు నొప్పి
చలి, జ్వరం
అలసట, నీరసం
వికారం
వాంతులు
విరోచనాలు
వంటి సాధారణ లక్షణాలు మాత్రమే కనిపిస్తాయి .

వైరస్ సోకినా వ్యక్తులు వ్యక్తిగత శుభ్రత పాటించాలి ,దగ్గినా ,తుమ్మినా చేతులను సబ్బుతో కడగటం చేయాలి . తగినంత విశారన్తీటేసుకోవాలి ,తగినంత వాటర్ తీసుకోవాలి. ఆక్సిజన్ 90 కంటే తక్కువగా ప్లస్ ఆక్సీ మీటర్లో చూపిస్తే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి . వీటికి సొంత వైద్యం పనికి రాదు అని గమనించాలి .

Updated On 11 March 2023 5:38 AM GMT
Ehatv

Ehatv

Next Story