పానీపూరీ(Panipuri) పేరు వింటే చాలు, అసంకల్పితంగానే నోట్లో నీళ్లు ఊరుతాయి! దాని రుచికి అలవాటు పడిపోయాం! అంత ఇష్టంగా తింటున్నాం కదా!

పానీపూరీ(Panipuri) పేరు వింటే చాలు, అసంకల్పితంగానే నోట్లో నీళ్లు ఊరుతాయి! దాని రుచికి అలవాటు పడిపోయాం! అంత ఇష్టంగా తింటున్నాం కదా! మనసుకు కష్టం కలిగించే వార్త ఒకటి తెలిసింది. పానీపూరీ తయారీలో కృత్రిక రంగులు(Chemical color) వినియోగిస్తున్నారట! వాటిల్లో కేన్సర్‌(Cancer) కారక రసాయనాలు ఉన్నాయట! ఒక్క గప్‌చుప్‌లోనే కాదు చాలా రకాల ఆహారాలలో ఆర్టిఫిషియల్ కలర్స్‌ కలుపుతున్నారని తేలింది. కర్నాటకలో(Karnataka) ఆహార భద్రత విభాగం అధికారులు(Food saftey Raids) బెంగళూరుతో పాటు 79 చోట్ల తనిఖీలు చేశారు. ఈ క్రమంలో ఆందోళనకరమైన విషయాలు అనేకం తెలిశాయి. పానీపూరీ తయారీలో వాడే సాస్‌, స్వీట్‌ చిల్లీ పౌడర్లలో కేన్సర్‌ కారక రసాయనాలు ఉన్నాయని తేలింది. చాలా వరకూ శాంపిళ్లలో సన్‌సెట్‌ యెల్లో, బ్రిలియంట్‌ బ్లూ, కార్మోసిన్‌ రంగులు ఉన్నాయని అధికారులు అంటున్నారు. బెంగళూరులో సేకరించిన 49 శాంపిళ్లలో 19 శాంపిళ్లలో సింథిటిక్‌ రంగులు ఉన్నాయట! ఈ నేపథ్యంలోనే గప్‌చుప్‌ తయారీలో కృత్రిమ రంగులతో తయారు చేస్తున్న సాస్‌, స్వీట్‌ చిల్లీ పౌడర్లను నిషేధించాలని అనుకుంటున్నారు. ఈ మధ్యనే కర్నాటక ఆరోగ్య శాఖ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది. గోబీ మంచూరియా, కబాబ్‌ వంటి ఆహార పదార్థాల తయారీలో ఆర్టిఫిషియల్‌ రంగుల వాడకాన్ని నిషేధించింది. కృత్రిమ రంగుల వల్ల అలర్జీ, పిల్లల్లో హైపర్‌ యాక్టివిటీ, అరుగుదల వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అదే పనిగా ఈ సింథటిక్‌ రంగులను తీసుకుంటే కేన్సర్‌ వచ్చే ప్రమాదం కూడా ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

Eha Tv

Eha Tv

Next Story