ఇప్పుడు చాలా మందికీ కామన్ గా వస్తున్న సమస్య అధిక బరువు(Heavy Weight)తో వచ్చే పొట్ట. కొంత మంది బక్కగా ఉన్నా కాని పొట్ట మాత్రం ముందుకు పొడుకుని వస్తుంది. ఈ సమస్య ఇప్పుడు చాలామందిని వేధిస్తుంది. ఎంత ప్రయత్నించినా పొట్ట కరకగపోవడంతో.. ఎంతో దిగులుపడుతుంటారు. ముఖ్యంగా పెళ్లికాని యువతకు ఈ సమస్య ఎక్కువగా వేధిస్తుంటుంది.

ఇప్పుడు చాలా మందికీ కామన్ గా వస్తున్న సమస్య అధిక బరువు(Heavy Weight)తో వచ్చే పొట్ట. కొంత మంది బక్కగా ఉన్నా కాని పొట్ట మాత్రం ముందుకు పొడుకుని వస్తుంది. ఈ సమస్య ఇప్పుడు చాలామందిని వేధిస్తుంది. ఎంత ప్రయత్నించినా పొట్ట కరకగపోవడంతో.. ఎంతో దిగులుపడుతుంటారు. ముఖ్యంగా పెళ్లికాని యువతకు ఈ సమస్య ఎక్కువగా వేధిస్తుంటుంది.

అధిక బరువు..పొట్ట పెరగడం లాంటింది బాగా కూర్చుని పనిచేసేవారికి.. శరీరాన్ని నిర్లక్ష్యంగా వదిలేసిన వారికి... ఎక్కువగా జంక్ ఫుడ్(Junk Food) తినేవారికి ఎక్కువగా వచ్చే సమస్య. వాటిని కంట్రోల్ లో పెట్టకుండా సడెన్ గా రెండుమూడు రోజుల్లో తగ్గిపోవాలి అంటే మాత్రం అది సాధ్యమయ్యే పని కాదు.

బరువుతగ్గడానికి చాలా ఉపయాలు ఉన్నాయి. అయితే కింద చెప్పబోయే ఉపాయాలు ఫాలో అవుతూనే.. శారీరక వ్యాయామం తప్పకుండా చేయాలి. శరీరానికి మీరు చెమటపట్టించకుండా.. బరువుతగ్గడం...పొట్ట తగ్గడం లాంటివి అసలు సాధ్యం కావు. అందుకే రేపటినుంచీ నడక మొదలుపెటండి. శరీరాన్ని ఫిట్ గా ఉంచుకోవడం కోసం ప్రయత్నించండి.

నడవమన్నాం కదా అని ఒకేసారి ఓ పదికిలోమీటర్లు పరిగెత్తకండీ... చిన్నగా స్టార్ట్ చేయండి.. రోజుకొంత పెంచుతూ పోండి.. వామప్స్ చేయండి.. ఉదయాన్నే ఆయిల్ ఫుడ్ తినడం మానేయండి. జంక్ ఫుడ్ జోలికి వెళ్ళకండి.. ఇవన్నీ సాధ్యం కావు అని అనిపిస్తాయి. కాని పట్టుదలతో చేస్తే చాలు.

పొట్ట చుట్టూ కొవ్వు (Belly Fat)పేరుకుపోతే ఆరోగ్యానికి ఎంతమాత్రం మంచిది కాదు. అందువల్ల వ్యాయామాలు చేయడంతో పాటు కొన్ని ఆహార పదార్థాలను తీసుకుంటుంటే నడుము చుట్టూ పేరుకున్న కొవ్వు తగ్గుతుంది. శరీర బరువు కూడా అదుపులో వుంటుంది. ఇంతకీ అవి ఎలాంటి పదార్థాలో చూద్దాం.

అల్లం టీ తాగడం వల్ల శరీర బరువు తగ్గుతుంది. అల్లం శరీర ఉష్ణోగ్రతను పెంచి కొవ్వును కరిగిస్తుంది. రోజూ అల్లం టీ తాగితే పొట్టచుట్టూ పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది. అల్లం టీ మాత్రమే కాదు రోజు ఒక కప్పు గ్రీన్ టీ తాగినా కూడా పొట్ట చుట్టూ చేరుకున్న కొవ్వు కరిగిపోతుంది.

రోజూ బాదం పప్పులు తింటే పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వును కరిగించడమే కాదు శరీర బరువును తగ్గిస్తాయి. బాదంలోని ఒమేగా-3 ప్యాటీ యాసిడ్స్ శరీరంలో పేరుకున్న ఫ్యాట్‌ని కరిస్తాయి. అందుకే రోజూ రాత్రి పడుకోబోయే ముందు ఆరేడు బాదం పప్పులు నీళ్లలో నానబెట్టి ఉదయం ఆ పప్పుపై వున్న పొట్టు తీసి తినాలి. ఇలా తినడం వలన శరీరం తేలికగా మారి నాజూగ్గా తయారవుతుంది.

పుదీనా కూడా పొట్ట చుట్టూ వున్న కొవ్వును కరిగించడంలో ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది. పొట్టలోని గ్యాస్ సమస్యను తగ్గిస్తుంది. ఇందులోని యాంటాక్సిడెంట్లు జీవక్రియ సరిగా జరిగేట్లు సహాయపడతాయి. కొవ్వును కరిగిస్తాయి. పుదీనా, కొత్తిమీర ఆకులను కలిపి బాగా సూరి అందులో నిమ్మరసం వేసి పేస్టులా తయారు చేయాలి. ఆ పేస్టులో చిటికెడు ఉప్పు వేయాలి. రోటి, ఇడ్లీల్లో ఈ చట్నీ వేసుకుని తింటే జీర్ణశక్తికి ఎంతో మంచిది. తిన్న ఆహరం జీర్ణమై.. పుదినా వలన కొవ్వురూపంలోకి మారకుండా శరీరానికి ఉపయోగపడుతుంది.

Updated On 25 March 2023 12:43 AM GMT
Ehatv

Ehatv

Next Story