చాలా మందికి అర్ధరాత్రి తినే అలవాటు(Mid night Cravings) ఉంటుంది. కాని అది చాలా చెడ్డ అలవాటు అని గుర్తుంచుకోండి. ఆ అలవాటు ఉంటే వెంటనే మానేయండి.మరి అర్ధరాత్రి ఆకలి అనిపిస్తే ఏం తినాలి.. ఖాళీ కడుపుతో పడుకోవడం కూడా మంచింది కాదు కదా. అయితే లేట్ నైట్ తినగలిగే ఆహార పదార్ధాలు(Food items) ఏంటీ...? ముఖ్యంగా లేట్ గా తినే ఆహారం నిద్రకు, జీర్ణవ్యవస్థకు(Digestive system) భంగం కలిగించకూడదు.

అలాగే కాంటినెంటల్ ఫుడ్స్ కు బదులు ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాలు తినడం వల్ల మీ పొట్ట త్వరగా నిండుతుంది. కానీ ఎక్కువగా తినవద్దు. అది సరే, అర్ధరాత్రి ఏం తినాలి అనేది చూద్దాం.

పెరుగు(Curd)

కొవ్వు రహిత పెరుగును అర్ధరాత్రి తీసుకోవడం మంచిది. ఇందులో ప్రోటీన్ మరియు ఇతర పోషకాలు కూడా ఉన్నాయి. మీరు దీన్ని తీసుకుంటే, అందులోని ప్రోటీన్ మీ ఆకలిని త్వరగా అణిచివేస్తుంది. కానీ పెరుగులో చక్కెరను కలపకూడదు.

దోసకాయ(cucumber)

ఇంట్లో దోసకాయ ఉంటే, మీరు తినవచ్చు. ఇందులో ఉండే నీరు వల్ల కడుపు నిండుతుంది. దోసకాయకు కాస్త పెప్పర్ రాసుకుని తింటే రుచి కూడా బాగుంటుంది.

బాదం(Almond)

బాదంలో ప్రొటీన్లు, పీచుపదార్థాలు, మెగ్నీషియం ఉంటాయి కాబట్టి వీటిని పడుకునే ముందు ఒక పిడికెడు తింటే మంచి అనుభూతిని పొంది నిద్ర బాగా పడుతుంది.

కారెట్(Carrot)

క్యారెట్‌లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి కాబట్టి వీటిని అర్థరాత్రి తింటే శరీరానికి కావాల్సిన పోషకాలు అందడంతో పాటు ఆకలి దప్పులు కూడా తగ్గుతాయి. ప్రధానంగా ఇవి క్యాలరీలు లేనివి కాబట్టి, బరువు పెరగకుండా నిరోధిస్తాయి.

అరటిపండు(Banana)

అర్ధరాత్రి అరటిపండు తినడం కూడా మంచిది. ఇవి సులభంగా జీర్ణమవుతాయి మరియు నిద్రకు భంగం కలిగించవు.

Updated On 12 May 2024 7:27 AM GMT
Ehatv

Ehatv

Next Story