వర్షాకాలం.. చలికాలం ఈరెండు సీజన్లలో ఏ పదార్ధం అయినా.. వేడి వేడిగా తినాలి అనిపిస్తుంది. చల్లగా అయితే తినబుద్ది కాదు. దాంతో చాలా మంది తిరిగి వేడి చేసుకుని తింటారు. ముఖ్యంగా ఓవెన్ ఉంటే చాలు.. రెండు మూడు సార్లు ఓవెన్ లో పెట్టి తింటుంటారు. కాని అది చాలా ప్రమాదం. కొన్ని పదార్ధాలు వేడిచేస్తే విషంగా మారుతాయని నిపుణులు చేపుతున్నారు.

వర్షాకాలం.. చలికాలం ఈరెండు సీజన్లలో ఏ పదార్ధం అయినా.. వేడి వేడిగా తినాలి అనిపిస్తుంది. చల్లగా అయితే తినబుద్ది కాదు. దాంతో చాలా మంది తిరిగి వేడి(Re-heat Food) చేసుకుని తింటారు. ముఖ్యంగా ఓవెన్(Oven) ఉంటే చాలు.. రెండు మూడు సార్లు ఓవెన్ లో పెట్టి తింటుంటారు. కాని అది చాలా ప్రమాదం. కొన్ని పదార్ధాలు వేడిచేస్తే విషంగా మారుతాయని నిపుణులు చేపుతున్నారు.

వర్షాకాలం అంటేనే వ్యాధుల కాలం. ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ ఏదో ఒక సీజనల్ వ్యాధి అలా వచ్చి చేరుతుంది. ముఖ్యంగా జలుబు.. దగ్గులాంటివి పక్కాగా రావల్సింది. అందుకే ఈ కాలంలో వేడివేడిగా ఆహారాన్ని తీసుకోవడం మంచిది. ఎప్పటి ఆహారం అప్పుడు వండుకుని తింటే మంచిది. అయితే కొంత మంది మాత్రం ఉదయం వండి.. ఫ్రిడ్జ్(Fridge) లో పెట్టి తర్వాత మళ్లీ బయటకు తీసి వేడిచేసి తింటుంటారు. అది చాలా ప్రమాదం అంటున్నారు నిపుణులు.

కొన్ని పదార్థాలను వేడిచేయడంవల్ల అవి విషంగా మారతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అందులో మరికొన్ని పదార్ధాలు రెండు మూడు సార్లు వేడి చేసి తింటుంటారు.. అది ఇంకా ప్రమాదం.. ఇంతకీ ఆ పదార్థాలు ఏవేంటనేది తెలుసుకుందాం.

మాంసాహారుల్లో చికెన్ ప్రియులే ఎక్కువమంది ఉంటారు.. ఒక్క సారి వండి రెండు మూడు రోజులుతింటుంటారు.. చికెన్(Chicken) అంటేనే పోషకాల నిలయం. ప్రొటీన్ బాగా దొరుకుతుంది. అయితే ఫ్రిడ్జ్ లో నిల్వ చేసుకొని తర్వాత పదే పదే వేడిచేసినప్పుడు అందులో ఉండే ప్రొటీన్ రూపాంతరం చెంది ప్రమాదకరంగా మారుతుంది. ఒక్కోసారి అది విషంగా కూడా తయారవుతుంది. దానివల్ల అజీర్తి సమస్య తలెత్తుతుంది.

వండిన అన్నాన్ని ఒక్కసారి ఫ్రిడ్జ్ లో పెట్టొచ్చు. తర్వాతరోజు వేడిచేసుకొని తినొచ్చు. అంతకంటే ఎక్కువ రోజులు, మరిన్ని సార్లు వేడిచేయడం మంచిది కాదు. బయట వాతావరణంలో ఉంచినప్పుడు హానికరమైన బ్యాక్టీరియా పెరుగుతుంది. మరీ ముఖ్యంగా చేపలు, రొయ్యలు లాంటి సీఫుడ్స్ ను తాజాగా వండుకుని తినాలి. నిల్వ ఉంచి వేడి చేసి తింటే.. ప్రమాదకర పదార్ధాలు తిన్నట్టే . దాని వల్ల పోషకాలు కూడా తగ్గిపోతాయి.

ఇక మరో విషయం ఏంటంటేు.. చాలా ఎక్కవ సార్లు.. ఎక్కువ సేపు వేడి చేసి తిన్న సీ ఫుడ్స్ ఎలర్జీని కలిగిస్తాయని నిఫునులు చెపుతున్నారు. గుడ్డుతోచేసిన పదార్ధాలు అయితే అస్సలు వేడి చేయకూడదట. అలా వేడి చేయడం వల్ల వాటిలో ఉవడే పోట్రీన్స్ తగ్గీపోయి.. విషంగా మారుతాయట...

ప్రొటీన్లు ఉన్న ఆహారంలో నైట్రోజన్‌ ఎక్కువగా ఉంటుంది. అతిగా వేడిచేయడం వల్ల నైట్రోజన్ కాస్తా.. ఆక్సిడైజ్‌ గా మారుతుంది. అది క్యాన్సర్‌ కారకం అవుతుంది. రకరకాలకాన్సర్లకు దారితీస్తుంది. నాన్ వేజ్ మాత్రమే కాదు.. వెజ్జీస్ లో కూడా కొన్ని పదార్ధాలు వేడి చేయకూడదు. మరీ ముఖ్యంగా పాలకూర పప్పు, పాలక్‌ పనీర్‌, పాలకూర పచ్చడి వేడిచేసిన కొద్దీ నైట్రోసమైన్స్‌గా మారి క్యాన్సర్‌కు దారితీస్తాయి.

వీటితో పాటు పుట్టగొడుగులు, బీట్ రూట్.. బంగాళదుంప, ఇతర దుంప కూరలను ఎక్కువగా వేడిచేసి తినకూడదు. అంతే కాదు అన్నాన్ని కూడా ఎక్కువగా వేడి చేస్తే.. అది కూడా ప్రమాదమే. చద్దన్నం తింటే ఆరోగ్యానికి మంచిది..కాని అది వేడి చేసుకుని తింటేనే చాలా ప్రమాదంగా మారుతుంది.

Updated On 31 July 2023 5:37 AM GMT
Ehatv

Ehatv

Next Story