ఈరోజుల్లో మహిళలను విపరీతంగా వేధిస్తున్న సమస్యలు బ్రెస్ట్ క్యాన్సర్(Breast cancer), సర్వైకల్ క్యాన్సర్(Cervical cancer).
ఈరోజుల్లో మహిళలను విపరీతంగా వేధిస్తున్న సమస్యలు బ్రెస్ట్ క్యాన్సర్(Breast cancer), సర్వైకల్ క్యాన్సర్(Cervical cancer). ప్రపంచవ్యాప్తంగా ప్రతి రోజూ మహిళలు ఈ వ్యాధిల బారిన పడి చనిపోతున్నారు. అయితే బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలంటే ఆహారంలో(Food) ఒక ఐదు పదార్థాలు నిత్యం చేర్చుకున్నట్లయితే దీనిని నివారించవచ్చని ఆరోగ్య రంగ నిపుణులు తెలుపుతున్నారు.
పాలకూర(Spinach), బచ్చలికూరలో కెరోటినాయిడ్లు ఉంటాయి ఇవి రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. 20 ఏళ్లలోపు 32,000 మంది స్త్రీలపై జరిపిన ఒక అధ్యయనంలో బచ్చలికూర లేదా ఆకు కూరలు ఎక్కువగా తినే స్త్రీలలో రొమ్ము క్యాన్సర్ 28% తగ్గుతుందని నిపుణులు తెలిపారు.
వెల్లుల్లి(Garlic): వెల్లుల్లి సమ్మేళనాలు క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించడమే కాకుండా వాపును తగ్గించడంలో సహాయపడుతుందని తేలింది. రొమ్ము, రక్తం, ప్రోస్టేట్, అండాశయ క్యాన్సర్ నివారణ మరియు చికిత్సలో కూడా వెల్లుల్లి తీసుకోవచ్చు..
బ్లూబెర్రీస్(Blueberries): రోజూ ఉదయం బ్లూబెర్రీస్ తీసుకోవడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా చూసుకోవచ్చునని నిపుణులు తెలిపారు. వాస్తవానికి, ఇందులో ఫ్లేవనాయిడ్లు, ఆంథోసైనిన్లు ఉంటాయి. ఇవి క్యాన్సర్ అభివృద్ధిని నిరోధించగలవు.
సాల్మన్(Salmon): 8,83,000 మంది మహిళలపై నిర్వహించిన ఒక అధ్యయనాన్నిచెప్తూ కొవ్వు ఉన్న చేపలను క్రమం తప్పకుండా తినే మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం 14% తగ్గుతుందని నిపుణులు చెప్తుతున్నారు. రొమ్ము క్యాన్సర్‌ను నివారించడంలో సాల్మన్ ప్రభావవంతంగా పరిగణించబడుతుంది.
పసుపు(Turmeric): భారతీయ వంటశాలలలో ఉపయోగించే పసుపు, క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంది, ఇది ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.