సిజేరియన్(Cesarean section) ద్వారా ప్రసవించిన మహిళలు ప్రోబయోటిక్ ఆహారాన్న(Probiotic food) తీసుకోవాలి. ఇందులోని మంచి బ్యాక్టీరియా రోగనిరోధక శక్తిని పెంచి ఆరోగ్యాన్ని బలపరుస్తుంది. పెరుగు(Curd) ఒక అద్భుతమైన ప్రోబయోటిక్ ఆహారం.

C-Section Food Diet
సిజేరియన్(Cesarean section) ద్వారా ప్రసవించిన మహిళలు ప్రోబయోటిక్ ఆహారాన్న(Probiotic food) తీసుకోవాలి. ఇందులోని మంచి బ్యాక్టీరియా రోగనిరోధక శక్తిని పెంచి ఆరోగ్యాన్ని బలపరుస్తుంది. పెరుగు(Curd) ఒక అద్భుతమైన ప్రోబయోటిక్ ఆహారం.
శస్త్రచికిత్స కారణంగా, కోతలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల, ఆ ప్రాంతంపై ఎక్కువ ఒత్తిడి పడకుండా మరియు ఇన్ఫెక్షన్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం.
స్నానం చేసే నీటిని(Bathing Water) శుభ్రంగా ఉంచడం మరీ మరీ గుర్తుంచుకోండి.
సర్జరీ వల్ల ఇబ్బందులు రాకుండా ఉండాలంటే.. సమయం దొరికినప్పుడల్లా మంచంపై ఉండటం కంటే.. కాసేపు అలా నడవండి... దీని వల్ల శరీరంలో రక్తం గడ్డకట్టకుండా నిరోధించడంలో సహాయపడుతుంది.
శస్త్రచికిత్స చేయించుకున్న మహిళలు పౌష్టికాహారంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. ప్రధానంగా విటమిన్ సి మరియు ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు. ఇవి కండరాల బలాన్ని పొందడంలో చాలా సహాయపడే ఆహారాలు.
ప్రసవానికి ముందు మరియు తరువాత మలబద్ధకం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా సర్జరీ చేయించుకున్న మహిళలు కూర్చొని మలవిసర్జన చేసేందుకు ప్రయత్నించినప్పుడు ఒత్తిడి పెరిగి రక్తస్రావం అయ్యే అవకాశం ఉంది. ఆహారంలో పీచుపదార్థాలు ఎక్కువగా తీసుకుంటే మలబద్ధకం రాకుండా చూసుకోవచ్చు.
తల్లిపాలు బిడ్డకే కాదు తల్లికి కూడా మేలు చేస్తాయి. కాబట్టి, కనీసం ఆరు నెలల నుండి 1 సంవత్సరం వరకు తల్లి పాలు ఇవ్వాలి.
బరువైన వస్తువులను ఎత్తవద్దు. ఇది శస్త్రచికిత్స చేసిన ప్రదేశంలో మరింత నొప్పిని కలిగిస్తుంది.వ్యాయామశాలకు వెళ్లే మహిళలు శస్త్రచికిత్స తర్వాత కొన్ని నెలల పాటు క్రంచెస్‌ను తగ్గించుకోవాలి
