స్వచ్ఛమైన మెంతి గింజలను చిటికెడు తీసుకుని రాత్రి పడుకునే ముందు 200 మి.లీ. సరిపడా నీళ్లు పోసి మూత పెట్టాలి. ఉదయం నిద్ర లేవగానే పుక్కిలించి, నీళ్లలో నానబెట్టిన మెంతులు తినాలి. తర్వాత మెంతి నీరు తాగాలి. ఇలా వారానికోసారి మెంతి నీళ్ళు తాగడం వల్ల శరీరంలో వేడి, మలబద్ధకం లాంటి ఏ రోగాల బారిన పడరు.

మనం రోజూ ఆహారంలో ఉపయోగించే పదార్థాలలో మెంతులు(Fenugreek Seeds) ఒకటి. మెంతులతో పాటు మెంతు కూర(fenugreek leaves) కూడా ఆరోగ్యానికి మంచింది.

ఆహారానికి రుచిని అందించడమే కాకుండా ఇందులోని వివిధ ఔషధ గుణాలు మనల్ని రోగాల బారిన పడకుండా కాపాడతాయి.

లెక్కలేనన్ని ఔషద గుణాలున్న మెంతికూరలో ఉండే గుణాలు, మెంతులు నయం చేసే వ్యాధుల గురించి మీకు తెలుసా?

స్వచ్ఛమైన మెంతి గింజలను చిటికెడు తీసుకుని రాత్రి పడుకునే ముందు 200 మి.లీ. సరిపడా నీళ్లు పోసి మూత పెట్టాలి. ఉదయం నిద్ర లేవగానే పుక్కిలించి, నీళ్లలో నానబెట్టిన మెంతులు తినాలి. తర్వాత మెంతి నీరు తాగాలి. ఇలా వారానికోసారి మెంతి నీళ్ళు తాగడం వల్ల శరీరంలో వేడి, మలబద్ధకం లాంటి ఏ రోగాల బారిన పడరు.

మెంతి పొడి:

ఒక టేబుల్‌స్పూన్ మెంతి గింజలను తీసుకుని బాణలిలో వేయించి చల్లారాక మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత మెంతిపొడిని బాటిల్‌లో ఉంచి, అవసరమైన మేరకు నీరు/పాలుతో(Milk) కలుపుకోవచ్చు. శరీరాన్ని ఫిట్‌గా ఉంచడంలో మెంతి పాత్ర అమోఘం.

అజీర్ణం(digestion) కోసం మెంతి పొడి:

పెసరపప్పుతో పాటు మెంతులను కొద్ది మొత్తంలో వేయించి పొడి చేసి ఒక గ్లాసు వేడి నీళ్లలో లేదా మజ్జిగలో సేవిస్తే కడుపులో లోపాలు, అజీర్ణం దరిచేరవు.

అలాగే మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ పొడిని నీళ్లలో/మజ్జిగలో కలిపి రోజూ తాగితే మధుమేహం అదుపులో ఉంటుంది. ఖాళీ కడుపుతో దీన్ని త్రాగాలి.

మెంతులను బాగా వేయించి పొడి చేసి కాఫీపొడిలో కలుపుకుని కాఫీలో తాగితే మధుమేహ వ్యాధిగ్రస్తులు షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటారు.

విరేచనాలు అయినప్పుడు మెంతిపొడిని గంటకు ఒకసారి చొప్పున రోజుకు 3 సార్లు తీసుకుంటే అతిసారం అదుపులో ఉంటుంది.

Updated On 1 Jun 2024 2:21 AM GMT
Ehatv

Ehatv

Next Story