లాస్టియర్ టమాట ధరలు(Tomato Price) సామాన్యులకు చుక్కలు చూపించిన విషయం తెలిసిందే! కిలో ధర 200 రూపాయలు దాటింది. కొన్ని చోట్ల అయితే 300 రూపాయలకు కూడా అమ్మారు. అప్పుడు టమాట పంటకు బోల్డంత కాపలా పెట్టుకున్నారు రైతులు. ఇప్పుడేమో ఎల్లిగడ్డలు(Garlic Price) ధరలు కొండెక్కి కూర్చున్నాయి. కిలో 500 రూపాయలు దాటడంతో రైతులు పంటపొలాల దగ్గరే కాపలా ఉంటున్నారు. కొందరైతే సీసీ కెమెరాలు(CC Camera) పెట్టుకుంటున్నారు.
లాస్టియర్ టమాట ధరలు(Tomato Price) సామాన్యులకు చుక్కలు చూపించిన విషయం తెలిసిందే! కిలో ధర 200 రూపాయలు దాటింది. కొన్ని చోట్ల అయితే 300 రూపాయలకు కూడా అమ్మారు. అప్పుడు టమాట పంటకు బోల్డంత కాపలా పెట్టుకున్నారు రైతులు. ఇప్పుడేమో ఎల్లిగడ్డలు(Garlic Price) ధరలు కొండెక్కి కూర్చున్నాయి. కిలో 500 రూపాయలు దాటడంతో రైతులు పంటపొలాల దగ్గరే కాపలా ఉంటున్నారు. కొందరైతే సీసీ కెమెరాలు(CC Camera) పెట్టుకుంటున్నారు. జనరల్‌గా ఇళ్లకో, దుకాణాలకో, కార్యాలయాలకో సీసీ కెమెరాలను పెడతారు. ఇప్పుడు ఎల్లిగడ్డల ధరల కారణంగా పంట పొలాల్లో కూడా సీసీ కెమెరాలు అమర్చుకుంటున్నారు రైతులు. గత ఏడాది టమాట ధరలు భారీగా పెరిగినప్పుడు రైతులు సీసీ కెమెరాల వైపు మొగ్గు చూపారు. కొందరు దొంగలు పంట పొలాల నుంచే ఎల్లిగడ్డలను ఎత్తుకెళ్లుతుండటంతో రైతులు సీసీ కెమెరాలను పెట్టుకుంటున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఛింద్వాడా జిల్లా మోహ్‌ఖేడ్ ప్రాంతంలోని అయిదారు గ్రామాలకు చెందిన పొలాల నుంచి ఎల్లిగడ్డ ఎత్తుకెళ్లిన సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. సీసీ కెమెరాల ఏర్పాటు తర్వాత చోరీలు అదుపులోకి వచ్చాయట!