Sankranthi : అల్లుడికి 300 రకాల వంటల.. అత్తింటి మర్యాద మామూలుగా లేదుగా..!
తెలుగురాష్ట్రాల్లో సంక్రాంతి(Sankranthi) వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పట్నం ప్రజలంతా పల్లెబాట పట్టారు. పల్లెలన్నీ కళకళలాడుతున్నాయి. భోగి(Bhogi) పండగతో మొదలైన సంబరాలు కనుమ(Kanumna) పండగతో ముగియనున్నాయి. కోడి పందాలు(Rooster fighiting), ఎడ్ల బండ్ల పోటీలు, గుండాటలు జోరుగా సాగుతున్నాయి.

అయితే పండగకు చుట్టాలు రావడం, ముఖ్యంగా కొత్తగా పెళ్లయిన తర్వాత అల్లుళ్లు(Son-in-Laws) అత్తారింటికి వెళ్లడం సహజం. అల్లుళ్లకు అత్తారింటి మర్యాదలు మామూలుగా ఉండడం లేదు. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో(Godavari Districts) ఈ మర్యాదలకు కొదువ ఉండదు. గత ఏడాది ఓ అల్లుడి 173 వంటకాలతో మర్యాదలు చేసిన ఘటన మరువక ముందే వారి రికార్డును తిరగరాశారు మరో అత్తగారు. అనకాపల్లికి (Anakapally)చెందిన తమ కూతురు రిషితను విశాఖకు చెందిన దేవేంద్రకు ఇచ్చి 2023లో వివాహం జరిపించారు. పెళ్లయిన తొలి సంక్రాంతి కావడంతో అత్తారింటికి అల్లుడు, కూతురు వచ్చారు. ఇంకేముంది అల్లుడి కోసం 300 రకాలైన ఆహార పదార్థాలు చేసి అతిథి మర్యాదలు చేశారు. ఈ వార్త ఇప్పుడు ఆ ఇంటా, ఈ ఇంటా చక్కర్లు కొడుతోంది. ఇలాంటి ఘటనే కృష్ణా(Krishna) జిల్లాలో చోటు చేసుకుంది. చిట్టూర్పు గ్రామానికి చెందిన సాయినాథ్ కుటుంబం 250 వంటకాలను తమ అల్లుడికి వడ్డించారు.