ఫంగల్ ఇన్ఫెక్షన్(Fungal Infection) వల్ల చుండ్రు(Dandruff) వస్తుంది. మన తలపై చర్మం నుంచి సాధారణంగా స్రవించే నూనె ద్వారా జుట్టుతో పాటు తలపై చర్మం(skin) కూడా రక్షించబడుతుంది. చలికాలంలో విపరీతమైన చలి కారణంగా, నూనె స్రావం తగ్గి, క్రిములు కనిపించడం వల్ల చుండ్రు పెరుగుతుంది.
ఇక ఈసమస్య నుంచి బయటపడి.. చుండ్రు నుంచి విముక్తి కలగాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం.

పచ్చిమిర్చి(Green chilly) రసం మరియు ఉల్లిపాయ(Onion) రసం:
పచ్చిమిర్చి రసాన్ని గ్రైండ్ చేసి దానితో సమాన పరిమాణంలో ఉల్లిపాయ రసాన్ని కలిపి తలకు పట్టించాలి. ఎండబెట్టిన తర్వాత మీ జుట్టును దువ్వండి. అప్పుడు తెలుస్తుంది ఎంత ప్రభావం చూపించిందో.
బీట్‌రూట్(Beetroot) రసం మరియు ఉల్లిపాయ రసం:
బీట్‌రూట్ చుండ్రును నియంత్రిస్తుంది. దీని రసాన్ని తీసుకుని ఉల్లిపాయ రసంతో కలిపి తలకు పట్టించాలి. 20 నిమిషాల తర్వాత మీ తలను కడగాలి.
యాపిల్ రసం మరియు ఉల్లిపాయ రసం:
యాపిల్ మరియు ఉల్లిపాయ రసాన్ని మిక్స్ చేసి తలకు పట్టించాలి. వారానికి 3 సార్లు చేయడానికి ప్రయత్నించండి. జుట్టు దట్టంగా, మెరిసిపోయి ఆరోగ్యంగా కనిపిస్తుంది.
కలబంద(alovera) మరియు ఉల్లిపాయ రసం:
కలబంద గుజ్జుతో ఉల్లిపాయ రసాన్ని కలిపి తలకు పట్టించి అరగంట తర్వాత కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది.
మెంతులు మరియు ఉల్లిపాయ రసం:
రెండు చెంచాల మెంతులను నానబెట్టి మరుసటి రోజు మెత్తగా రుబ్బుకుని అరకప్పు ఉల్లిపాయ రసంలో కలిపి తలకు పట్టించాలి. 30 నిమిషాల తర్వాత మీ జుట్టును కడగాలి. ఇలా చేస్తే చుండ్రు బాధ నుంచి విముక్తి కలుగుతుంది.