చేపల్లో పులస చేపలు ఎందుకంత ఫేమస్సంటే రుచి బ్రహ్మండంగా ఉంటుంది కాబట్టి.. అందుకే ధర కూడా ఎక్కువే! అట్టాగే పుచ్చకాయల్లో డెన్సుకే పుచ్చకాయలకు(Densuke watermelons) ఎందుకంత క్రేజు అంటే అదిరిపోయే టేస్టు ఉంటుంది కాబట్టి.. ఈ పుచ్చకాయలను తినడానికి కోరిక ఒక్కటే సరిపోదు..

చేపల్లో పులస చేపలు ఎందుకంత ఫేమస్సంటే రుచి బ్రహ్మండంగా ఉంటుంది కాబట్టి.. అందుకే ధర కూడా ఎక్కువే! అట్టాగే పుచ్చకాయల్లో డెన్సుకే పుచ్చకాయలకు(Densuke watermelons) ఎందుకంత క్రేజు అంటే అదిరిపోయే టేస్టు ఉంటుంది కాబట్టి.. ఈ పుచ్చకాయలను తినడానికి కోరిక ఒక్కటే సరిపోదు.. డబ్బులు కూడా చాలానే ఉండాలి. ఆ మాటకొస్తే అప్పర్‌ మిడిల్‌ క్లాస్‌ మనుషులకు కూడా సాధ్యం కాదు.. జిహ్వ చాపల్యం చంపులేకపోతే మాత్రం బ్యాంకులో లోను తీసుకోవాల్సి వస్తుంది.. పోదురూ .. మరీ అతి చేస్తున్నారు అని అనుకుంటున్నారా? అయితే వీటి రేటు చెబుతాను.. మార్కెట్‌లో ప్రస్తుతం ఒక్క పుచ్చకాయ ధర అయిదు లక్షల(5 lakhs) రూపాయలు ఉంది.. జపాన్‌లో(Japan) పండే ఈ అరుదైన పుచ్చకాయ అక్కడ చాలా ఫేమస్‌.

ఈ రకాన్ని డెన్సుకే అంటారు. దీన్ని పండించడానికి అత్యాధునిక వ్యవసాయ పద్దతులను పాటిస్తారు. చాలా జాగ్రత్తగా సాగు చేయాల్సి ఉంటుంది. ఒక్కో పుచ్చకాయ బరువు ఆరు నుంచి ఏడు కిలోల(7kgs) వరకు ఉంటుంది. ఇక రుచి అంటారా? చాలా తీయ్యగా, కరకరలాడుతూ చాలా బాగుంటుంది. ఏడాదంతా సాగు చేస్తే కేవలం వంద డెన్సుకే పుచ్చకాయలు మాత్రమే పండుతాయి. పైగా ఇవి ఎక్కడపడితే అక్కడ దొరకవు. వీటిని ప్రత్యేకంగా వేలంపాట(auction) ద్వారా అమ్ముతారు. జీవితంలో ఒక్కసారైనా ఈ పుచ్చకాయ రుచి చూడాలనుకునేవారు ఈ వేలం పాటలో పాల్గొంటారు. ఈ పుచ్చకాయ రేటు ప్రతి ఏటా పెరుగుతూ వస్తోంది. ఇప్పుడు సుమారు అయదు లక్షల రూపాయలుంది. మరో సంగతేమిటంటే.. ఈ పుచ్చకాయలను కొనేవారెవ్వరూ వాటిని తినరట! ఎవరికైనా బహుమతిగా ఇస్తారట!

Updated On 8 July 2023 6:18 AM GMT
Ehatv

Ehatv

Next Story